ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు

ABN, First Publish Date - 2021-03-02T06:02:13+05:30

రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని విద్యుత్‌, అటవీ, పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వర్గీయ దామోదరం సంజీవయ్య శతజయంతిని పురస్కరించుకొని స్థానిక ఐఎంఎ హాలులో జరిగిన దళిత సమ్మేళనంలో మంత్రి బాలినేని ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు.

దళిత సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి బాలినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి బాలినేని

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 1 : రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని  విద్యుత్‌, అటవీ, పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వర్గీయ దామోదరం సంజీవయ్య శతజయంతిని పురస్కరించుకొని స్థానిక ఐఎంఎ హాలులో జరిగిన దళిత సమ్మేళనంలో  మంత్రి బాలినేని ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. దళిత హక్కులపరిరక్ష ణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అధ్యక్షతన జరిగిన సభలో బాలినేని మాట్లాడుతూ యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు స్థానం నుంచి రాష్ట్రమంత్రి అయ్యేంత వరకు తన వెన్నంటి ఉన్న దళితుల వల్లే 35 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. తాను రాజకీయాల్లో ఉండి దళితుల కోసం పనిచేస్తే నీలం నాగేంద్రం దళితుల పక్షాన నిలిచి ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు చేశాడన్నారు. సభలో దళిత నేత నాగేంద్రం ప్రస్తావించిన అంశాలను ఎన్నికలు ముగిశాక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్‌, దళిత బహుజన ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె. వినయ్‌కుమార్‌, గంగాడ సుజాత, పి.రత్నరాజు, పొటికలపూడి జయరాంతదితరులు ఉన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా ఐఎంఎ హాలు వరకు వెళ్లారు. 



Updated Date - 2021-03-02T06:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising