ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్పీ ఆలోచనా ధోరణి మార్చుకోవాలి

ABN, First Publish Date - 2021-07-25T06:03:08+05:30

ఎస్సీ, ఎస్టీల పట్ల డీఎస్పీ కిశోర్‌కుమార్‌ తన ధోరణి మార్చుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్య క్షుడు నీలం నాగేంద్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మార్కాపురం, జూలై 24 : ఎస్సీ, ఎస్టీల పట్ల డీఎస్పీ కిశోర్‌కుమార్‌ తన ధోరణి మార్చుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్య క్షుడు నీలం నాగేంద్ర అన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో ఎస్సీ, ఎస్టీ కేసు ల్లో బాధితుల పట్ల డీఎస్పీ వైఖరి, సామాజిక బాధ్యతపై సమావేశం నిర్వహించారు. నాగేంద్ర మాట్లాడుతూ భూస్వామ్య, పెత్తందారీ మన స్తత్వమున్న కిశోర్‌కుమార్‌ లాంటి డీఎస్పీని ఇప్పటి వరకూ చూడలేద న్నారు. ఆయన ఎస్సీ, ఎస్టీ ప్రజలను అవమానపరుస్తున్నారన్నారు. డీ ఎస్పీ కిశోర్‌ ప్రెండ్లీ పోలీసింగ్‌ను అపహాస్యం చేస్తున్నారన్నారు. రాజకీయ పార్టీల చోటా మోటా నాయకులకు అతి మర్యాదలు చేస్తూ, ఎస్సీ, ఎస్టీల ను నిల్చోబెట్టి మాట్లాడడం సరికాదన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఎస్పీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి సండ్రపాటి ప్రసాద్‌, దళిత నా యకులు అచ్చయ్య, నూతలపాటి రాజు, నందం శేఖర్‌, ఎనిబెర కిశోర్‌, చిలకా ఇజ్రాయేల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising