ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఆర్‌డీఏ పీడీగా నారాయణ కొనసాగింపు

ABN, First Publish Date - 2021-02-28T06:04:55+05:30

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), వెలుగు ప్రాజెక్టు అధికారిగా ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్న నారాయణ కొన సాగనున్నారు. కొత్త పీడీగా నియమితులైన బి.బాబూరావు శనివారం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలవగా, జాయిన్‌ చేసుకునేందుకు ఆయన విముఖత చూపిన ట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాబూరావుకు ‘నో’ చెప్పిన కలెక్టర్‌


ఒంగోలు నగరం, ఫిబ్రవరి 27 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), వెలుగు ప్రాజెక్టు అధికారిగా ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్న నారాయణ కొన సాగనున్నారు. కొత్త పీడీగా నియమితులైన బి.బాబూరావు శనివారం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలవగా, జాయిన్‌ చేసుకునేందుకు ఆయన విముఖత చూపిన ట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు ఆగాలని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకే కలెక్టర్‌ ఆవిధంగా వ్యవహరించినట్లు తె లుస్తోంది. బాబూరావును పీడీగా నియమించవద్దం టూ రెండ్రోజుల క్రితం డీఆర్‌డీఏ వెలుగు సిబ్బందే క లెక్టర్‌ను కలిసి విన్నవించారు. గతంలో బాబూరావు డీ ఆర్‌డీఏలో ఏపీడీగానూ, ఎస్సీ కార్పొరేషన్‌లోనూ పని చేశారు. అప్పట్లో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నా యి.  ఈ నేపథ్యంలో ఏపీఎ్‌సఐడీసీలో జియాలజిస్టు గా పనిచేస్తున్న బాబూరావును డీఆర్‌డీఏ పీడీగా ని యమిస్తూ మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్త ర్వులు ఇచ్చింది. ఆయన విధుల్లో చేరేందుకు శనివా రం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలవగా ‘వెయిట్‌ చే యండి. చూద్దాం’ అని చెప్పినట్లు తెలిసింది. పీడీ గా బాబూరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామాల నే పథ్యంలో బాబూరావు బాధ్యతలు చేపట్టలేకపోయా రు. కాగా పీడీ పోస్టు కోసం మరో ఇద్దరు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి పీడీగా పనిచేస్తున్న స్టెప్‌ సీఈవో నారాయణ, గ తంలో డీఆర్‌డీఏలో ఏపీడీగా పనిచేసిన భరత్‌ కు మార్‌ ఇద్దరూ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ని యామకానికి ప్రజాప్రతినిధులు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇ చ్చినట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరు పీడీగా నియ మితులయ్యే అవకాశం ఉంది. ఆమేరకు ఒకట్రెండు రో జుల్లో ఉత్తర్వులు రానున్నాయి. ఆ కారణంగానే బా బూరావును జాయిన్‌ చేసుకోలేదని సమాచారం. 

Updated Date - 2021-02-28T06:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising