ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దు

ABN, First Publish Date - 2021-08-01T07:16:28+05:30

కొవిడ్‌ నిబందనలను పాటించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడతారని నగరపంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు.

ప్రచారం నిర్వహిస్తున్న చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, జూలై 31: కొవిడ్‌ నిబందనలను పాటించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడతారని నగరపంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో వైరస్‌ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నిభందనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడమే కాకుండా, తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అన్‌లాక్‌ నేపథ్యంలో ప్రజారవాణాతో  పాటు అన్ని సాదారణ స్థితికి వచ్చాయన్నారు.  నిర్లక్ష్యంగా ఉండవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్‌ నియంత్రణకు సహకరించాలన్నారు. కరోనా మూడవ దశ వ్యాప్తి కాకుండా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం 4వ సచివాలయంలో కొవిడ్‌ మేనేజ్మెంట్‌ కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, కౌన్సిలర్‌ తమ్మినేని సుజాత, ఎస్సై రామిరెడ్డి, గుడ్‌హెల్ప్‌ రమేష్‌, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T07:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising