ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధి నిర్వహణలో అలక్ష్యం తగదు

ABN, First Publish Date - 2021-04-24T05:20:08+05:30

: పోలీసు సిబ్బంది విధులలో కోవిడ్‌-19 పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరి

చీరాలటౌన్‌, ఏప్రిల్‌ 23 : పోలీసు సిబ్బంది విధులలో కోవిడ్‌-19 పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరి అన్నారు. మండల పరిధిలోని ఈపూరుపాలెంలోని నేతాజీ యూనియన్‌ కార్యాలయంలో చీరాల రూరల్‌ పరిధిలోని పోలీసులకు కోవిడ్‌ - పోలీస్‌ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విధులలో ఫిర్యాదులతో ఎలా వ్యవహరించాలి, కొవిడ్‌ నిబంధనలు ఎలా అమలుజేయాలి, స్టేషన్‌ ఎలా పరిశుభ్రంగా ఉంచాలి వంటి వాటిపై అవగాహన కల్పించారు. అలాగే విధుల నుంచి ఇంటికి వచ్చిన చేతులు శుభ్రపరచి లోనికి అనుమతించాలని సూచించారు. అలాగే అత్యవసర సమయంలో వినియోగించే మందులు ఇమ్యూనిటీ అందించే ఆహార పదార్ధాలు పోలీస్‌ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో చీరాల రూరల్‌ సీఐ రోశయ్య, ఎస్సైలు సుబ్బారావు, మహ్మద్‌ జానీ, వేటపాలెం, ఈపూరుపాలెం, కారంచేడు పరిధిలోని పోలీసులు  సచివాలయ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T05:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising