ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ కార్మికులను సచివాలయానికి అప్పగించవద్దు

ABN, First Publish Date - 2021-06-16T07:24:17+05:30

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రెండవరోజు మంగళవారం కనిగిరి లో పారిశుధ్య సిబ్బంది నిరసన సమ్మె నిర్వహించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమ్మెలో పాల్గొన్న పారిశుధ్య సిబ్బంది

కనిగిరి, జూన్‌ 15: మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రెండవరోజు మంగళవారం కనిగిరి లో పారిశుధ్య సిబ్బంది నిరసన సమ్మె నిర్వహించారు. స్ధానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న యూటీ ఎఫ్‌ నాయకుడు మీగడ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ నగర పంచాయతీలో వార్డు లకు తగినంత మేర సిబ్బంది నియ మించాలన్నారు. పనిముట్ల కొరతతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సచివాలయాలకు సిబ్బందిని అప్పగించ వద్దని కోరారు. సిబ్బందికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకుడు  ఖాదర్‌వలి మాట్లా డుతూ ఇంజనీరింగ్‌ స్కిల్డ్‌ వేత నాలు సిబ్బందికి ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. అనంతరం కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణారావుకు వినతిపత్రం అందజేశారు. కార్య క్రమంలో యూనియన్‌ నాయ కులు ప్రసాద్‌, దానియేలు, ఓబయ్య, గరటయ్య, మార్కు, విజయలక్ష్మి, రవణమ్మ, ఆదిలక్ష్మి, గురవయ్య, లక్ష్మయ్య, ఎలీషా సీఐటీయూ నాయకులు ఎం.కొండారెడ్డి, ఎస్‌కే రఫి, జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-16T07:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising