ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపాస్‌ ఆప్కాను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-08-02T06:40:37+05:30

కాంట్రాక్టు కార్మికులను దోపిడీకి గురిచేసే ఆపాస్‌ ఆప్కాను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి యాసిన్‌ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న యాసిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి యాసిన్‌

కనిగిరి, ఆగస్టు 1: కాంట్రాక్టు కార్మికులను దోపిడీకి గురిచేసే ఆపాస్‌ ఆప్కాను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి యాసిన్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక దర్శి చెంచయ్య భవనంలో ఆదివారం సీపీఐ కార్యవర్గ సభ్యులు వై.రవీంద్రబాబు అధ్యక్షతన మున్సిపల్‌వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాసిన్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని హమీ ఇచ్చి ఇంత వరకు నెరవేర్చలేదని విమర్శించారు. . కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11న దర్శిలో జరగనున్న మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నాయకులు వై.రవీంద్రబాబు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు గుజ్జుల బాలిరెడ్డి, జీపీ.రామారావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాజర్‌, కిరణ్‌, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T06:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising