ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపదైనా ఆటోలే దిక్కు..!

ABN, First Publish Date - 2021-10-25T04:14:55+05:30

మీ ప్రాణాలకు మాది భరోసా అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్న ప్రభుత్వ మాటలకు ఆచరణకు పొంతన లేదు. ఆటోలలో ప్రయాణం ప్రమాదమని తెలిసినా సక్రమంగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం, వేళకు రాకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

ఆటోపై ప్రమాదకర ప్రయాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్లెకు రాని ఆర్టీసీ బస్సులు

కిక్కిరిసిన జనంతో ప్రయాణం

అధిక ధరతోపాటు అసౌకర్యం 

కంభం, అక్టోబరు 24 : మీ ప్రాణాలకు మాది భరోసా అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్న ప్రభుత్వ మాటలకు ఆచరణకు పొంతన లేదు. ఆటోలలో ప్రయాణం ప్రమాదమని తెలిసినా సక్రమంగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం, వేళకు రాకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు లేక నేటికీ కంభం, అర్ధవీడు, బేస్తవారపేట మండలాల్లోని కొన్ని గ్రామాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా ఏడాదిపాటు పల్లె ముఖం చూడని బస్సులు ప్రస్తుతం అరకొరగా తిరుగుతున్నాయి. మొక్కుబడిగా ఏడాదికోసారి ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నా అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. 

కంభం మండలంలోని కందులాపురం, రావిపాడు, లింగోజీపల్లి, ఎల్‌.కోట, ఔరంగబాద్‌ గ్రామాలకు నేటికీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఆటోలు, జీపులపైనే నిత్యం ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.  లైసెన్సులు లేని డ్రైవర్లతో ఎక్కడ ప్రాణహాని ఉంటుందో అని భయంతో ప్రయాణాలు సాగిస్తున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పైగా ఆటో చార్జీలు ఇటీవల భారీగా పెంచారని, కిక్కిరిసిన ప్రయాణికులతో కరోనా భయంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణిస్తున్నామి చెప్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-25T04:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising