ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వలలతోనే కట్టకు పొంచి ఉన్న ప్రమాదం

ABN, First Publish Date - 2021-12-02T05:35:50+05:30

మోపాడు రిజర్వాయర్‌లో పెంచుతున్న కోట్లాది రూపాయల విలువ కలిగిన చేపలను కాపాడు కొనేందుకు అధికారపార్టీకి చెందిన నాయకులు అలుగు వద్ద వలలు ఏర్పాటు చేశారని, దీంతో నీరు సక్రమంగా బయటకు పోకపోవడం వలన కట్టకు ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆరోపించారు. మోపాడు రిజర్వాయర్‌ కట్టకు ఏర్పడ్డ లీకేజీల పరిశీలనలో భాగంగా బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం స్థానిక శేషమహల్‌ ఆవరణలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఉగ్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరు, డిసెంబరు 1: మోపాడు రిజర్వాయర్‌లో పెంచుతున్న కోట్లాది రూపాయల విలువ కలిగిన చేపలను కాపాడు కొనేందుకు అధికారపార్టీకి చెందిన నాయకులు అలుగు వద్ద వలలు ఏర్పాటు చేశారని, దీంతో నీరు సక్రమంగా బయటకు పోకపోవడం వలన కట్టకు ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆరోపించారు. మోపాడు రిజర్వాయర్‌ కట్టకు ఏర్పడ్డ లీకేజీల పరిశీలనలో భాగంగా బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం స్థానిక శేషమహల్‌ ఆవరణలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. చేపలపై ఉన్న ప్రేమ ప్రజలపై కనపడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. తన హయంలో జైకో నిఽధులు సాధించానని, సంవత్సరం కిందటనే నిధులు మంజూరైనా అధికారపార్టీ నాయకులు పర్శంటేజీల కోసం కక్కుర్తిపడి పనులు చేయడంలో జాప్యం చేయడం వలన పనులు నత్తనడక సాగుతున్నాయన్నారు. తాను కట్టకు చేపడుతున్న సహాయక కార్యక్రమాలను చూసేందుకు వెళ్లగా అధికారపార్టీ నాయకుల ఆదేశాలతో పామూరు ఎస్‌ఐ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు. బొట్లగూడూరు, కంభాలదిన్నె, మోపాడు, 4 ఎస్సీ పాలెంలో ఉన్న బాధితులతో తాను మాట్లాడి ఎవ్వరూ ఆధైర్య పడవద్దని, ఎటువంటి సహకారం కావాలన్నా తాను అందిస్తానని, ఎలాంటి విపత్కర పరిస్థితులు జరిగే అవకాశం ఉన్నా ముందస్తుగా అందరూ పామూరులోని పువ్వాడి కల్యాణ మండపానికి చేరుకోవాలని ఆయన భరోసా కల్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కె సుభాషిణి, బొల్లా మాల్యాద్రి చౌదరి, ఎం. హుస్సేన్‌రావు యాదవ్‌, భైరెడ్డి జయరామిరెడ్డి, ఎం. గంగరాజు యాదవ్‌, ఎం. రమణయ్య, గుర్రం వెంకటేశ్వర్లు, వైఎస్‌ ప్రసాద్‌రెడ్డి, షేక్‌ ఖాజారహంతుల్లా, ఏ ప్రభాకర్‌, డోలా శేషాద్రి, కౌలూరి ఖాజారహంతుల్లా, పువ్వాడి రామారావు, ఎన్‌. సాంబయ్య, ఇర్రి కోటిరెడ్డి, షేక్‌ గౌస్‌బాష, గుత్తి మహేష్‌, మొబీనా మౌలాలి, ఎం. రమాదేవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

  


Updated Date - 2021-12-02T05:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising