ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై కదిలిన యంత్రాంగం

ABN, First Publish Date - 2021-04-18T05:58:19+05:30

పల్లెల్లో ఆధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. పర్చూరు మండల పరిధిలో చాపకింద నీరులా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తుండటంతో పాటు మరణాలు చోటు చేసు కుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌, ఎంపీడీవో

గ్రామాల సందర్శన

పల్లెల్లో పారిశుధ్య చర్యలు 

ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన 

పర్చూరు, ఏప్రిల్‌ 17: పల్లెల్లో ఆధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు.  పర్చూరు మండల పరిధిలో చాపకింద నీరులా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తుండటంతో పాటు మరణాలు చోటు చేసు కుంటున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెల కొంది. ఈనేపథ్యంలో ‘పర్చూరులో పెరు గుతున్న కరోనా మరణాలు’ శీర్షికన శని వారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ నానికి అధికారులు స్పందించారు. ఎంపీడీవో ఎస్‌.మోహన్‌రావు, తహసీల్దార్‌ శ్రీనివాసరావు నేతృత్వంలోని పంచాయతీ, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పారిశుధ్య కా ర్యక్రమాలు నిర్వహించారు. కరోనా కేసులు నమోదు అయిన నివాసాల చుట్టుపక్కల బ్లీ చింగ్‌తోపాటు శానిటేషన్‌ చేపట్టారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు కరోనా పరీక్షలు చే యించుకోవాలని సూచించారు. దీనికి సం బంధించి గ్రామాల్లో వైద్య శిభిరాలు ఏర్పాటు చేస్తామని, ప్రజలు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీడీవో కోరారు.  మండలంలోని వీరన్నపాలెం, బోడ వాడ తదితర, ఉప్పుటూరు తదితర గ్రా మాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిం చారు. కాగా, వీరన్నపాలెం గ్రామంలో ఇప్పటికీ ఇద్దరు కరోనా అనుమానిత మరణాలు చో టుచేసుకోగా, తాజాగా శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో అధికారులు అప్ర మత్తమై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. 


Updated Date - 2021-04-18T05:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising