ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాలు వేసి ప్రాణాలు కాపాడాలి

ABN, First Publish Date - 2021-05-09T06:34:53+05:30

ప్రజలందరికీ టీకాలు వేసి ప్రా ణాలు కాపాడాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాం డ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ వైఖరిపై టీడీపీ నిరసనలు

ఇళ్లవద్దే ఆందోళన తెలిపిన పార్టీ శ్రేణులు

మార్కాపురం (వన్‌టౌన్‌) మే 8 : ప్రజలందరికీ టీకాలు వేసి ప్రా ణాలు కాపాడాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి  డిమాం డ్‌ చేశారు. స్థానిక జవహర్‌నగర్‌లోని కందుల నివాసంలో టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్ర భుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చి న పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.  కరోనాతో ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆం దోళన వ్యక్తం చేశారు. ఇటువంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఇంత వర కు లేదన్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాలి కొండ య్య, టీడీపీ నాయకులు కాశిరెడ్డి, మల్లికార్జున, చిలకపాటి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ తన నివాసంలో నిరసన తెలిపారు.

అందరికీ కరోనా 

వ్యాక్సిన్‌ వేయాలి

పొదిలి (రూరల్‌) : కరోనా వ్యాక్సి న్‌ను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రికీ వేయాలని టీడీపీ మండల అధ్య క్షుడు మీగడ ఓబు ల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం టీడీపీ నా యకులు తమ ఇళ్ల నుంచే నిరసన తెలి పారు. మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ ర సూల్‌,  బీసీ సెల్‌ అధ్యక్షుడు పొల్లా నరసింహారావు, నాయకులు బాబూ రావు యాదవ్‌, యర్రంరెడ్డి వెంక టేశ్వరరెడ్డి, ముని శ్రీను తదితరులు ఈ కార్యక్రమం చేపట్టారు. 

ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతనలేదు 

గిద్దలూరు టౌన్‌ :  రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని టీడీపీ నాయకులు విమ ర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సూచన మేరకు మండలపార్టీ అధ్యక్షుడు మా ర్తాల సుబ్బారెడ్డి, నియోజకవర్గ ఐటీడీపీ కోఆర్డినేటర్‌ దూదేకుల దస్తగిరి, పట్టణ ఐటీడీపీ కోఆర్డినేటర్‌ గర్రె సాయినాథ్‌ నిర సన కార్యక్రమాలు నిర్వహిం చారు. కరోనా బాధితులకు బెడ్లు, ఆక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్నా రన్నారు. వైద్యం అందక మృత్యు వాతపడుతున్నా జగన్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఎవరి ఇంట్లో వారే ఉండి నిరసన తెలిపారు. 

  ప్లకార్డుల ప్రదర్శన

త్రిపురాంతకం : 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని కోరుతూ శనివారం మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈసందర్భంగా ఇళ్ల వ ద్దనే భౌతికదూరం పాటించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.


Updated Date - 2021-05-09T06:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising