ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దంకిలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-08-06T05:50:45+05:30

అద్దంకి నగరపంచాయతీ పరిధిలో కొవిడ్‌ ఉధృతి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటిస్తూ గురువారం సిబ్బంది ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమాయత్తమవుతున్నారు.

అద్దంకిలోని గురకాయపాలెంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంటైన్మెంట్‌ జోన్లు గా పలు ప్రాంతాలు 

కట్టడి చర్యలకు  సిద్ధమవుతున్న అధికారులు 

చీరాలలోనూ విస్తరిస్తున్న వైరస్‌


అద్దంకి, ఆగస్టు 5: అద్దంకి నగరపంచాయతీ పరిధిలో కొవిడ్‌ ఉధృతి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటిస్తూ గురువారం సిబ్బంది ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమాయత్తమవుతున్నారు. కర్ఫ్యూ సమయాన్ని పెంచే దిశగా మండల టా స్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారులు సిద్ధం అవుతున్నా రు. ఇటీవల కాలంలో పట్టణంలో సుమారు 300 మంది కొవిడ్‌ బారిన పడగా ప్రస్తుతం 70 యాక్టి వ్‌ కేసులు ఉన్నట్లు కమిషనర్‌ ఫజులుల్లా తెలిపారు. కొవిడ్‌ బాధితులు ఎక్కువ నమోదు అవు తున్న ప్రాంతాలలో శుక్రవారం నుంచి మరింత కట్టడి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగకుండా బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. రాజీవ్‌కాలనీ, గురకాయపాలెం, పసుమర్తిపాలెం తదితర ప్రాంతాలను కంటైన్మెం ట్‌ జోన్‌లుగా గుర్తించి గురువారం ప్లెక్సీలు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి కర్ప్యూ సమయాన్ని పెంచే వి ధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. 

చీరాలటౌన్‌: మునిసిపల్‌ పరిధిలోని రామనగర్‌ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ మల్లేశ్వరరావు చెప్పారు. ఈ నే పథ్యంలో గురువారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ రామనగర్‌లో ప్రస్తుతం 13 యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌ కంటైన్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ ప్రాంతం లో ఇష్టారీతిగా రాకపోకలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీవోలు శ్రీనివాసరావు, రామకృష్ణ తది తరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-06T05:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising