ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ మృతులకు పరిహారం

ABN, First Publish Date - 2021-10-27T07:32:38+05:30

జిల్లాలో కొవిడ్‌తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఉపక్రమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కొక్కరికి రూ.50వేలు 

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

కమిటీ ఏర్పాటుకు కసరత్తు

ఒంగోలు(కలెక్టరేట్‌); అక్టోబరు 26 : జిల్లాలో కొవిడ్‌తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా ల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో పరిహారం చెల్లింపు జరుగుతుంది.  ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. అందుకు అవసరమైన చర్యలను జేసీ టీఎస్‌ చేతన్‌ తీసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో కొవిడ్‌-19తో ఇప్పటి వరకు 1,123మంది మృతిచెందారు. వారి కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలనిని ప్రభుత్వం ఆదేశాలు జాచేసింది. కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయడంతోపాటు మృతుల జాబితాను రూపొందించనున్నారు. డీఆర్వో నేతృత్వంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్‌ కేటాయించడంతోపాటు రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లాలో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 



Updated Date - 2021-10-27T07:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising