ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కమిషనర్‌

ABN, First Publish Date - 2021-11-28T04:18:44+05:30

పొదిలి పట్టణంలోని జాతీయ రహదారి పక్కన జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నగరపంచాయతీ కమిషనర్‌ భవానీప్ర సాద్‌ తన సిబ్బందితో కలిసి శనివారం అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పొదిలి, నవంబరు 27: పొదిలి పట్టణంలోని జాతీయ రహదారి పక్కన జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని నగరపంచాయతీ కమిషనర్‌ భవానీప్ర సాద్‌ తన సిబ్బందితో కలిసి శనివారం అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతు లు తీసుకోకుండా నిర్మాణ పనులు ఎలా చేపట్టారని ఆయన నిలదీశారు. పట్టణంలో పలు భవననిర్మాణ పనులు జరుగుతున్నాయి, అవి మీకు కనపడవా అని ప్రశ్నించడంతో భవనయజమానులకు, అధికారులకు తీవ్ర వాదోపవాదం జరిగింది. గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఇప్పటికీ ఖాత రు చేయకుండా నిర్మాణ పనులు చేపట్టడంపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తేల్చి చె ప్పారు. ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే కార్యాలయం చుట్టూ తిరగకుండానే అనుమతులు మంజూరు అవుతాయని భవానీ ప్రసాద్‌ చెప్పారు. అయినప్పటికీ నిర్మాణదారులు రెండస్తుల స్లాబువేసి వ్యాపారసముదాయాన్ని నిర్మించడం ఏమిటన్నారు. ఈదశలో ఉధ్రిక్త పరిసి ్థతి నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ శ్రీహరి సిబ్బం దితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిర్మాణ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  


Updated Date - 2021-11-28T04:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising