ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చామా..! పోయామా..!!

ABN, First Publish Date - 2021-12-07T05:32:13+05:30

పౌర సేవలు అందించడంలో ఒంగోలు తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. సోమవారం ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని విజిట్‌ చేయగా అధికారులు వచ్చామా.. పోయామా.. అన్నట్లుగా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు తహసీల్దారు, ఇతర సిబ్బంది కనిపించినా, ఫైళ్లజోలికెళ్లలేదు. 11.10 గంటలకు తహసీల్దార్‌ బయటకు వెళ్లిపోయి తిరిగి 12.30 గంటలకు ఆఫీసుకు వచ్చారు. ఆర్‌ఐ, వీఆర్వోలు అసలు కార్యాలయానికే రాలేదు. పలువురు దరఖాస్తుదారులు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎదురు చూసినా సంబంధిత ఉద్యోగులు లేక పోవడంతో ఉసూరుమంటూ వెళ్లారు. వాళ్లు రారు.. సంతకాలు పెట్టరు అంటూ పనుల కోసం వచ్చిన ప్రజలు అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత వారం పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడే లేడని, కనీసం సమాధానం కూడా చెప్పేవారు లేరని పలువురు బాధితులు ఆంధ్రజ్యోతి ఎదుట వాపోయారు.

అధికారులు, సిబ్బంది రాక వెలవెలబోతున్న ఒంగోలు మండల తహసీల్దార్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు తహసీల్దారు కార్యాలయ తీరు 

అందుబాటులో ఉండని ఆర్‌ఐ, వీఆర్వోలు

- సంతకాల కోసం రోజుల తరబడి ఎదురు చూపులు

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 6 : పౌర సేవలు అందించడంలో ఒంగోలు తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. సోమవారం ఆంధ్రజ్యోతి  కార్యాలయాన్ని విజిట్‌ చేయగా అధికారులు వచ్చామా.. పోయామా.. అన్నట్లుగా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు తహసీల్దారు, ఇతర సిబ్బంది కనిపించినా, ఫైళ్లజోలికెళ్లలేదు. 11.10 గంటలకు తహసీల్దార్‌ బయటకు వెళ్లిపోయి తిరిగి 12.30 గంటలకు ఆఫీసుకు వచ్చారు. ఆర్‌ఐ, వీఆర్వోలు అసలు కార్యాలయానికే రాలేదు. పలువురు దరఖాస్తుదారులు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎదురు చూసినా సంబంధిత ఉద్యోగులు లేక పోవడంతో ఉసూరుమంటూ వెళ్లారు.  వాళ్లు రారు.. సంతకాలు పెట్టరు అంటూ పనుల కోసం వచ్చిన ప్రజలు అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత వారం పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడే లేడని, కనీసం సమాధానం కూడా చెప్పేవారు లేరని పలువురు బాధితులు ఆంధ్రజ్యోతి ఎదుట వాపోయారు. కార్యాలయంలో ఆఫ్‌లైన్‌ వ్యవహారాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. పలువురు అధికార పార్టీ నాయకులు, రియల్టర్లు మధ్యాహ్నం 1 గంట తర్వాత కార్యాలయానికి రావడంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కార్యాలయంలో హడావిడి కనిపించింది. వీఆర్వోలు ఇద్దరు సెలవులో ఉండగా మరొకరు ఎప్పుడొస్తారో తెలియదని సిబ్బంది తాపీగా సమాధానమిచ్చారు. 


Updated Date - 2021-12-07T05:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising