ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్న సేవలకే కలరింగ్‌!

ABN, First Publish Date - 2021-09-12T06:27:25+05:30

వారంతా కొన్ని నెలలుగా నేరుగా బ్యాంకులు అందుబాటులో లేని గ్రామా ల్లో వివిధ రకాల సేవలంది స్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్బీకేల పరిధిలో బ్యాంకింగ్‌ సేవలంటూ ప్రభుత్వం హడావుడి

కొన్ని నెలలుగా 640మంది బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవలు

జీతభత్యాలన్నీ భరించేది బ్యాంకులే 

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 11 :  వారంతా కొన్ని నెలలుగా నేరుగా బ్యాంకులు అందుబాటులో లేని గ్రామా ల్లో వివిధ రకాల సేవలంది స్తున్నారు. ఆయా బ్యాంకులు వీరిని నియమించుకున్నాయి. వీరినే బీసీ(బిజినెస్‌ కరస్పాం డెంట్లు)లుగా పిలుస్తారు. జిల్లావ్యాప్తంగా 640మంది వివిధ గ్రామాల్లో ఎప్పటినుంచో సేవలందిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కన్ను వీరిపై పడింది. వారంతా  రోజూ రెండు గంటలపాటు విధిగా సమీప ఆర్బీకేల్లో రైతులకు అందుబాటులో ఉండేవిధంగా అనుసంధానించింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రభుత్వమే ఈ  వ్యవస్థకు రూపకల్పన చేసినట్లు హడావుడి మొదలుపెట్టడం చూసి సంబంధిత బీసీలే ఆశ్చర్యపోతున్నారు. ఙ


గ్రామాల్లో బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవలు

రిజర్వ్‌ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం 5వేల జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకు సేవలు నేరుగా అందాలి. ఇది వ్యయప్రయాసలతో కూడుకోవడంతో ఆర్‌బీఐ ఆదేశాలను గౌరవిస్తూ బిజినెస్‌ కరస్పాండెంట్ల(బీసీల) నియామకా నికి అవి శ్రీకారం చుట్టాయి. ప్రజలు రూ.10వేలు జమచేయడంతో పాటు రూ.20వేల వరకు నగదును బీసీల ద్వారా తీసుకోవచ్చు. నగదు బదిలీ మాత్రం రూ.10వేలకే పరిమితం చేశారు. ఇవేకాకుండా వివిధ రుణ సదుపాయాలకు సంబంధించి గ్రామంలో ఉన్న వారికి అవగాహన కల్పించడం, కొత్త ఖాతాల ఓపెన్‌లో సహాయకారిగా ఉండటం బీసీలు ప్రధానంగా నిర్వహించే విధులుగా ఉన్నాయి. 

 

 ప్రభుత్వం ఆర్బీకేలకు అనుసంధానించడం ద్వారా....

బీసీలను ఆర్‌బీకేలకు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం వారు రోజూ రెండు గంటలపాటు విధిగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంటారు. జిల్లాలో ఉన్న 879 ఆర్బీకేల పరిధిలో బిజినెస్‌ కరస్పాండెంట్లను ఇప్పటికే యంత్రాంగం మ్యాపింగ్‌ చేసింది. ఖరీఫ్‌ సీజన్‌లో రూ.4,250 కోట్లను రైతులకు రుణాలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులం దరికీ రుణాలు అందేవిధంగా ఈ కరస్పాండెంట్లు కృషిచేయాల్సి ఉంది.





Updated Date - 2021-09-12T06:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising