ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశాళాల బస్సు బోల్తా

ABN, First Publish Date - 2021-03-02T07:14:27+05:30

మార్కాపురంలోని ఓ ఫార్మసీ కళాశాలకు చెందిన బస్సు మండలంలోని సీతానాగులవరం వద్ద బోల్తా కొట్టింది.

గాయాలైన విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడుగురు విద్యార్థులకు గాయాలు

మద్యం మత్తులో డ్రైవర్‌

తర్లుపాడు, మార్చి 1 : మార్కాపురంలోని ఓ ఫార్మసీ కళాశాలకు చెందిన బస్సు మండలంలోని సీతానాగులవరం వద్ద బోల్తా కొట్టింది. అందులో ఉన్న ఏగుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం జరిగింది. మార్కాపురంలో ఫార్మసీ కళాశాలకు చెందిన బస్సు గిద్దలూరు నుంచి బయల్దేరింది. మధ్యలో విద్యార్థులను ఎక్కించుకుంటూ కంభం, తర్లుపాడు మీదుగా సీతానాగులవరంనకు చేరుకుంది. అక్కడ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది.  పెద్ద శబ్దం రావడంతో పొలాల వద్ద ఉన్న రైతులు పరుగులు తీసి వచ్చి విద్యార్థులను బయటకు తీశారు. ఆ సమయంలో బస్సులో 45 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. వీరిలో భవానీ, కౌసల్య, జ్యోతి, స్వాతి, కావ్య, కల్యాణి, ఎస్‌.కె.వసీం అక్రమ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిని మరో 20 మందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. డ్రైవర్‌ పూటుగా మద్యం సేవించి బస్సు నడపడంతో బోల్తా పడిందని ప్రజలు అంటున్నారు. బస్సు బోల్తా పడిన తర్వాత డ్రైవర్‌ ఊగుతూ పరుగెత్తుతున్న సమయంలో యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బస్సు డ్రైవర్‌ ఎక్కడ మద్యం సేవించింది విచారణలో తేలనుంది. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2021-03-02T07:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising