నిరుపేదలకు ప్రభుత్వం చేయూత
ABN, First Publish Date - 2021-05-20T06:25:19+05:30
నిరుపేదలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఎవరూ అధైర్యపడ వద్దని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కోరారు. బుధవారం బల్లికురవ మండలప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలలో అనారోగ్య బారినపడి పడి వైద్యశాల ల్లో చికిత్సలు చేయించుకొన్న 65 మందికి సీఎం రి లీ్‌ఫఫండ్ ద్వారా మంజురైన రూ. 23 లక్షల నగదు చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య
బల్లికురవ, మే 19 : నిరుపేదలకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఎవరూ అధైర్యపడ వద్దని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య కోరారు. బుధవారం బల్లికురవ మండలప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలలో అనారోగ్య బారినపడి పడి వైద్యశాల ల్లో చికిత్సలు చేయించుకొన్న 65 మందికి సీఎం రి లీ్‌ఫఫండ్ ద్వారా మంజురైన రూ. 23 లక్షల నగదు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకొంటామని చెప్పారు. అనంతరం గ్రామాలలో నెలకొన్న సమస్యల గురించి అధికారులతో మాట్లాడి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో సంతమాగులూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతల పేరయ్య, ఎ ంపీడీవో వైజ శ్రీనివాసరావు, తహసీల్దార్ అశోక్‌వర్దన్, మండలపార్టీ నేతలు చింతల శ్రీనివాసరావు, మీరావలి, శ్రీనువలి, సర్పంచ్‌లు దూళిపాళ్ల బుల్లిరామయ్య, పసల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-20T06:25:19+05:30 IST