ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న సీఐడీ తనిఖీలు

ABN, First Publish Date - 2021-04-13T06:40:04+05:30

ప్రభుత్య వైద్యశాలలో సీఐడీ తనిఖీలు రెండోరోజూ కొనసాగాయి.

ఒంగోలు రిమ్స్‌లో విచారిస్తున్న సీఐడీ డీఎస్పీ చెంచురామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యశాలల్లో ముమ్మరంగా విచారణలు 

మరో రెండు రోజులు కొనసాగే అవకాశం 

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 12: ప్రభుత్య వైద్యశాలలో సీఐడీ తనిఖీలు రెండోరోజూ కొనసాగాయి. సోమవారం ఒంగోలు రిమ్స్‌, మార్టూరు, అద్దంకి, శింగరాయకొండలతో పాటు కనిగిరి ప్రాంతాల్లో జరిగాయి. జిల్లాలో ఎనిమిది బృందాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా అందులో ఒక డీఎస్సీ, సీఐతోపాటు, ఆరుగురు ఎస్సైలు ఉన్నారు. 2015 నుంచి 2018 వరకూ ఆసుపత్రుల్లో కొనుగోలు చేసిన బయోమెడికల్‌ పరికరాలు నాణ్యతతోపాటు.. వాటి నిర్వహణ, వినియోగం తదితర అంశాలను కూడా సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా వాటి నిర్వహణ బాధ్యత తీసుకున్న కాంట్రాక్టర్లు ఏవిధంగా చేస్తున్నారు అన్నది కూడా విచారిస్తున్నారు. ఆ పరికారాల వినియోగం, మరమ్మతులకు గురైతే కాంట్రాక్టర్లు స్పందిస్తున్నారా అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. వీరు ఈనెల 16న సీఐడీ అదనపు డీజీపీ పి.వి.సునీల్‌కుమార్‌కు నివేదికలు అందజేయనున్నారు. ఒంగోలు రిమ్స్‌లో సోమవారం సీఐడీ డీఎస్పీ చెంచురామారావు తనిఖీలు నిర్వహించారు. అక్కడ డాక్టర్లతో మాట్లాడి బయోమెడికల్‌ పరికరాల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. రో రెండురోజులు ఈ తనిఖీలు కొనసాగుతాయని అంటున్నారు.



Updated Date - 2021-04-13T06:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising