కోతకు గురైన చెరువు కట్ట..!
ABN, First Publish Date - 2021-07-12T05:39:45+05:30
తర్లుపాడు చెరువు కట్ట గత సంవత్సరం కోతకు గురైంది. కట్టంత నెర్రెలు బారింది. పరిస్థితి ఇలా ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
పట్టించుకోని అధికారులు
తర్లుపాడు, జూలై 11 : తర్లుపాడు చెరువు కట్ట గత సంవత్సరం కోతకు గురైంది. కట్టంత నెర్రెలు బారింది. పరిస్థితి ఇలా ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం వర్షా కాలంలో చెరువులోకి నీరు చేరితే కట్ట తెగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రజలు విన్నవించుకున్నా చెరువు కట్టకు మరమ్మతులు చేస్తామని అంటూ కాలయాపన చేస్తున్నారు. నీరు చేరితే కట్ట తెగి పొలాలన్ని కోతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం చెరువు కట్ట అంత ముళ్ల కంపతో అలముకొని ఉంది. తూము వద్ద కూడా బారీ స్థాయి గండి ఉండటంతో చెరువులోకి చుక్క నీరు చేరినా వెల్లిపోతుంది. మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లకు నీరు రాకపోవడంతో ప్రజలు దాహర్తి తీర్చేందుకు కూడా ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువు కట్టకు మరమ్మతులు చేసి చెరువు కట్ట కోతకు గురికాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2021-07-12T05:39:45+05:30 IST