ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

ABN, First Publish Date - 2021-04-17T05:51:20+05:30

: వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేవిధంగా చలి వేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తహసీల్దార్‌ పుల్లారావు పేర్కొన్నారు.

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న తహసీల్దార్‌ పుల్లారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తహసీల్దార్‌ పుల్లారావు 

కనిగిరి, ఏప్రిల్‌ 16: వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేవిధంగా చలి వేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తహసీల్దార్‌ పుల్లారావు పేర్కొన్నారు. పట్టణంలోని పామూరు బస్టాండ్‌ బస్‌షెల్టర్‌లో మానవతా సేవా సంస్థ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సేవా సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. ఇటీవల ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు ఉపకార వేతనాల పంపిణీ, రక్తదాన శిబిరాల ఏర్పాటు, ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదలకు వైద్యం అందించడం, ఉచిత అంబులెన్స్‌ సేవలు, మార్చురీ ఫీజర్‌ అందించడం, శాంతిరథాలను ఉచితంగా అందించడం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.  కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ గఫార్‌, సంస్థ అధ్యక్షుడు పిచ్చిరెడ్డి, సోమిశెట్టి శ్రీనివాసులు, బి శ్రీనివాసులు, రామక్రిష్ణ, పసుపులేటి అరుణోదర్‌, తిరుపతిరెడ్డి, కోమటిగుంట్ల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising