ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీమకుర్తిలో చైన్‌ స్నాచర్‌ కలకలం

ABN, First Publish Date - 2021-12-05T05:38:08+05:30

చీమకుర్తి పట్టణంలో చైన్‌స్నాచర్లు హడలెత్తిస్తు న్నారు. వ్యాపారస్థులు, వృద్ధ మహిళలే లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌కి పాల్ప డుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌన్సిలర్‌ తల్లి మెడలో బంగారు గొలుసు చోరీ


చీమకుర్తి, డిసెంబరు 4 : చీమకుర్తి పట్టణంలో చైన్‌స్నాచర్లు హడలెత్తిస్తు న్నారు. వ్యాపారస్థులు, వృద్ధ మహిళలే లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌కి పాల్ప డుతున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలో జనం రద్దీగా ఉన్న సమ యంలోనే 8వ వార్డు కౌన్సిలర్‌ సోమా శేషాద్రి తల్లి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లడం సంచలనం రేపింది. స్థానిక కొత్త సినిమాహాల్‌ సమీపం లో వృద్ధ మహిళ సోమా కోటేశ్వరమ్మ చిల్లరకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె దుకా ణం వద్దకు ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి సిగరెట్‌ కావాలని అడిగారు. దీంతో ఆమె పక్కకు తిరిగేలోపు ఒక్క ఉదుటున మెడలోని 4.5 సవర్ల బం గారం గొలుసును లాక్కొని ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగశివారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా ఇదే తరహ సంఘటన ఇటీవల జరగ టంతో పట్టణవాసుల్లో ఆందోళన నెలకొంది.


Updated Date - 2021-12-05T05:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising