ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడుగు ముందుకు పడని బైపాస్‌ రోడ్డు

ABN, First Publish Date - 2021-04-22T05:46:24+05:30

గిద్దలూరు పట్టణానికి మంజూరైన బైపాస్‌ రోడ్డు నిర్మాణం ఏళ్లు గడుస్తు న్నా అడుగు ముందుకు పడడం లేదు.

గిద్దలూరు - వినుకొండ మధ్య జరిగిన రోడ్డు విస్తరణ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


భూ సేకరణ జరిగినా సాగని పనులు

పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం

ఎదురు చూస్తున్న ప్రజలు  

గిద్దలూరు, ఏప్రిల్‌ 21 : గిద్దలూరు పట్టణానికి మంజూరైన బైపాస్‌ రోడ్డు నిర్మాణం ఏళ్లు  గడుస్తు న్నా అడుగు ముందుకు పడడం లేదు. ఈ అంశం ఫైళ్లలో మగ్గుతుంది.  రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా చివరి దశలో ఉండగా రోడ్డు నిర్మాణం మాత్రం మొదలు కాలేదు. బైపాస్‌ రో డ్డు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య చాలా వ రకు  తగ్గుతుంది. రాష్ట్ర విభజన అనంతరం అమరావతి రాజధానిగా ఎంపిక చేయగా అనంతపురం నుం చి రాజధాని ప్రాంతానికి ప్రయాణ రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో గత ప్రభుత్వం అనంతపురం నుంచి తాడిపత్రి, నంద్యాల, గిద్దలూరు, వినుకొండ మీదుగా గుంటూరు వరకు ప్రస్తుతం ఉన్న స్టేట్‌హైవే రోడ్డును నేషనల్‌ హైవే రోడ్డుగా మార్పు చే శారు. ఈరోడ్డుకు నేషనల్‌ హైవే అథారిటీ వారు 544 డీ నెంబరును కేటాయించారు. ఈ మొత్తం రోడ్డును విస్తరించడం వలన ట్రాఫిక్‌ సమస్య చాలావరకు పరిష్కారం అవుతుందని భావించారు. మొదటి విడతగా గిద్దలూరు నుంచి వినుకొండ వరకు 678 కోట్లతో విస్తరణ కార్యక్రమం మొదలు పెట్టారు. ప నులు చివరి దశకు చేరుకున్నాయి. గిద్దలూరు నుంచి అనంతపురం వరకు ఇలాగే విస్తరణ పనులు గత ప్ర భుత్వంలో టెండర్లు పిలిచినప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వలన టెండర్‌ ఆగిపోయింది. పనులు మొదలుకాలేదు. 

ఈ టెండర్‌లోనే గిద్దలూరు పట్టణానికి బైపాస్‌ నిర్మాణ పనులు కూడా ఉన్నాయి. దిగువమెట్ట - కెఎస్‌పల్లి మధ్య గల భీమలింగేశ్వరస్వామి దేవాలయం సమీపం నుంచి ఉప్పలపాడు, కొండపే ట, పాములపల్లి, కొత్తపల్లి గ్రామాల సమీపం నుంచి బైపాస్‌ రోడ్డు గిద్దలూరు - వినుకొండ రోడ్డులో పట్టణ శివార్లలోని కోల్డ్‌స్టోరేజీ సమీపంలో కలుస్తుంది. 100 అడుగుల వెడల్పులో బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ శాఖ భూసేకరణ చేపట్టింది. రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేయడమే తరువాయి అన్నట్లుగా ఉండ గా వేసిన టెండర్‌ ఆగిపోవడంతో ఇటు గిద్దలూరు నుంచి అనంతపురం వరకు రోడ్డు విస్తరణ పనులు వాయిదాపడగా ఆ ప్యాకేజీలో భాగమైన బైపా్‌సరోడ్డు నిర్మాణం కూడా వాయిదా పడింది. దాంతో ట్రాఫిక్‌ పాత రోడ్డుపైనే వస్తుండడంతో పెరిగిన ట్రాఫిక్‌కు తగ్గట్లు రోడ్డు వెడల్పు లేకపోవడంతో నిత్యం పట్టణం లో ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతున్నది. గిద్దలూరు పట్ట ణం గుండా వెళ్లే ఈ నేషనల్‌ హైవే రోడ్డుకు ఆనుకు ని రైల్వేలైన్‌ ఉండడం, పట్టణంలోనే రెండు ప్రాంతాలలో రైల్వేగేట్లు ఉండడంతో రైలు, గూడ్స్‌ వచ్చిన ప్రతిసారీ గేట్లు మూసిన సందర్భాలలో ట్రాఫిక్‌ పెరిగి నేషనల్‌ హైవే రోడ్డుపై కూడా వాహనాలను నిలుస్తు న్నాయి. దాంతో గేటు పడిన సందర్భాలలో నేషనల్‌ హైవే రోడ్డుపై వాహనాలన్నీ ఆగిపోతుండడంతో ట్రా ఫిక్‌ సమస్య నెలకొంటున్నది. పట్టణానికి బైపా్‌సరోడ్డు ఏర్పడితే పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గడమే కాకుం డా చుట్టుపక్కల గ్రామాల వాహన చోదకులు పట్టణంలోకి రాకుండా బైపాస్‌ గుండా గమ్య స్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభు త్వం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అటు మి గిలిన విస్తరణ పనులు, ఇటు బైపా్‌సరోడ్డు నిర్మాణం వెంటనే జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Updated Date - 2021-04-22T05:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising