ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల వలలు దహనం

ABN, First Publish Date - 2021-01-17T05:26:27+05:30

మండలంలోని బాపయ్యనగర్‌ సముద్ర తీరాన మత్స్యకారులు ఉంచిన వలలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. దీంతో రూ. 25లక్షల నష్టం వాటిల్లింది. ఈమేరకు బాధిత మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం ప్రకారం.. పల్లెపాలెం పంచాయతీ పరిధిలోని తూర్పుపల్లెపాలెం గ్రామానికి చెందిన నాయుడు శ్రీను, బాపయ్యనగర్‌ గ్రామానికి చెందిన

దగ్ధం అయిన వలలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రూ. 25 లక్షల నష్టం 

బాపయ్యనగర్‌ వద్ద ఘటన

చినగంజాం, జనవరి 16 : మండలంలోని బాపయ్యనగర్‌ సముద్ర తీరాన మత్స్యకారులు ఉంచిన వలలను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. దీంతో రూ. 25లక్షల నష్టం వాటిల్లింది. ఈమేరకు బాధిత మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం ప్రకారం.. పల్లెపాలెం పంచాయతీ పరిధిలోని తూర్పుపల్లెపాలెం గ్రామానికి చెందిన నాయుడు శ్రీను, బాపయ్యనగర్‌ గ్రామానికి చెందిన ఐలా రామజోగి, సంఖ్యా అంజయ్య, రేవు కోటేశ్వరరావు, ఐలా మూలయ్య, సంఖ్యా నాగార్జున, నాయుడు శ్రీనులు చేపల వేటకు వెళ్లి బుధవారం ఒడ్డుకు వచ్చారు. సముద్రానికి సమీపంలోని బాపయ్యనగర్‌ వద్ద సరుగుడుతోటలో  80 వలలను ఉంచారు. శనివారం వేకువజామున మళ్లీ వేటకు బయల్దేరుతూ వలలను చూసుకోగా అవి కాలి బూడిదై ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఎవరో కావాలని చేసిన పనేనని వారు అనుమానం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-01-17T05:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising