ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో బహుజన రాజ్యస్థాపనే లక్ష్యం

ABN, First Publish Date - 2021-07-30T06:08:48+05:30

రాష్ట్రంలో బహుజనరాజ్య స్థాపనే లక్ష్యంగా పని చేయాలని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి పిలుపునిచ్చారు. గురువారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది.

సదస్సులో మాట్లాడుతున్న అధ్యక్షుడు పరంజ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి


ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 29 : రాష్ట్రంలో బహుజనరాజ్య స్థాపనే లక్ష్యంగా పని చేయాలని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బక్క పరంజ్యోతి పిలుపునిచ్చారు. గురువారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జాతీయ అధ్యక్షురాలు మాయావతి నేతృత్వంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్ర అర్థికపరిస్థితి దివాళా తీసిందని ఆరోపించారు. కోట్ల రూపాయాలు అప్పుల మీద ఆధారపడి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంలో 2వేలకు పైగా రోగాలను కేవలం సంఖ్యగా మాత్రమే చూపిస్తూ చివరికి కొవిడ్‌కట్టడిలో కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. అమరావతిలో రాజదాని ఉండటం అందరిని శ్రేయస్కరమని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయినా రాజధానిపై ఒక స్పష్టమైన నిర్ణయం వెల్లడిచేయకపోవడం ఈ ప్రభుత్వానికి ఆసర్థత పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గ్రానైట్‌ను అడ్డుపెట్టుకొని కొందరు రాజకీయ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. అంతకు ముందు నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు తాటిపర్తి వెంకటస్వామి  అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కోఆర్డినేటర్లు బాలయ్య, మల్లిక్‌, గడ్డం సందరావు, జి.చిత్రసీన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్‌కుమార్‌, కాకి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising