ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెనలు శిథిలం!

ABN, First Publish Date - 2021-01-24T05:38:53+05:30

అద్దంకి నియోజకవర్గంలో పలుచోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీం తో ఆయా వంతెనలపై ప్రయాణించటం వాహనచోద కుల్లో గుబులు రేపుతోంది.

పేరాయపాలెం వద్ద దోర్నపువాగుపై మధ్యలో కుంగిన బ్రిడ్జి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి నియోజకవర్గంలో పలుచోట్ల అధ్వానంగా బ్రిడ్జీలు

భయాందోళనలో వాహనదారులు

పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు


అద్దంకి, జనవరి 23 : అద్దంకి నియోజకవర్గంలో పలుచోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీం తో ఆయా వంతెనలపై ప్రయాణించటం వాహనచోద కుల్లో గుబులు రేపుతోంది. నియోజకవర్గంలో గత దశా బ్దకాలంగా గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ పలు ప్ర ధాన రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగాయి. ఆయా రోడ్ల నిర్మాణం, విస్తరణ సమయంలో ఆయా మార్గా ల్లో ఉన్న వంతెనల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ప్ర స్తుతం అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రధానం గా అద్దంకి, చీమకుర్తి, తాళ్లూరు, మద్దిపాడు మండ లాల్లోని పలు గ్రామాలకు ఉపయోగపడేలా, అద్దం కి-చీమకుర్తికి దగ్గరి మా ర్గంగా ఉండే విధంగా అ ద్దంకి మండలం తిమ్మాయపాలెంఅద్దంకి, జనవరి 23 : అద్దంకి  నియోజకవర్గంలో పలుచోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీం తో ఆయా వంతెనలపై ప్రయాణించటం వాహనచోద కుల్లో గుబులు రేపుతోంది. నియోజకవర్గంలో గత దశా బ్దకాలంగా గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ పలు ప్ర ధాన రోడ్ల నిర్మాణం  పెద్ద ఎత్తున  జరిగాయి. ఆయా రోడ్ల  నిర్మాణం, విస్తరణ  సమయంలో ఆయా మార్గా ల్లో ఉన్న వంతెనల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ప్ర స్తుతం అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రధానం గా అద్దంకి, చీమకుర్తి, తాళ్లూరు, మద్దిపాడు మండ లాల్లోని పలు గ్రామాలకు ఉపయోగపడేలా,  అద్దం కి-చీమకుర్తికి దగ్గరి మా ర్గంగా  ఉండే విధంగా అ ద్దంకి మండలం తిమ్మాయపాలెం నుంచి చీమకుర్తి  మండలం ఇలపావులూరు  వరకు  తారురోడ్డు నిర్మా ణం  జరిగింది. మోదేపల్లి  వద్ద చిలకలేరు వాగు, పే రాయపాలెం వద్ద దోర్నపు వాగుపై గతంలో నిర్మించిన వంతెనలను అలానే ఉంచారు. చిలకలేరువాగుపై ఉన్న బ్రిడ్జికి కొంతమేర మరమ్మతులు చేయటంతో ఇబ్బందు లు తొలగాయి.  పేరాయపాలెం  వద్ద దోర్నపువాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీనిపై ప లుచోట్ల భారీ గుంతలు ఏర్పడడంతో పాటు కోతకు గు రై ఎత్తు పల్లాలుగా మారింది. దీంతో ఏ సమయంలో కూలుతుందోనని వాహన చోదకులు ఆందోళన  చెందు తున్నారు. వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో అద్దంకి-ధేనువకొండ మధ్య నడిచే బస్సు సర్వీసును కూడా నిలిపివేశారు. అలాగే అద్దంకి-రేణింగవరం  మ ధ్య  మూడు చోట్ల  వాగులపై ఉన్న వంతెనను కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. అదే సమయంలో రో డ్డు విస్తరణ జరిగినప్పటికీ బ్రిడ్జిల పునర్నిర్మాణం చే పట్టలేదు. అద్దంకి-బల్లికురవ-సంతమాగులూరు రోడ్డు లో వల్లాపల్లి సమీపంలో అద్దంకి బ్రాంచి కెనాల్‌పై బ్రి డ్జి  కూడా పూర్తిగా పాడుబడింది. అదే  సమయంలో ఏబీసీపై వలపర్ల వద్ద, రామకూరు  వద్ద, పమిడిపాడు మేజర్‌పై ముప్పవరం, వెంకటాపురం తదితర ప్రాంతా ల్లో ఉన్న బ్రిడ్జిలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. బల్లి కురవ-సంతమాగులూరు మధ్య కొప్పరం సమీపంలో బ్రిడ్జిలు కూడా దుస్థితికి చేరి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు,  ఉన్నతాధికారులు స్పం దించి ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మాణం చేపట్టేలా చర్యలు  చేపట్టా లని  వాహనచోదకులు, ప్రజలు కోరుతున్నారు. 



Updated Date - 2021-01-24T05:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising