ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ మరణం

ABN, First Publish Date - 2021-05-18T05:28:52+05:30

చీరాల సమీపంలోని పేరా లలో బ్లాక్‌ ఫంగస్‌ మరణం చోటుచేసుకుంది. ప్రజలతోపాటు అధికారగణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా సెకండ్‌ వేవ్‌తో అవస్థలు పడు తున్న అధికారులకు, ప్రజలకు బ్లాక్‌ ఫంగస్‌తో ఆందోళన మరింత పెంచింది.

శిద్దా సురేష్‌(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాలలో ఒకరు మృతి

చీరాలటౌన్‌, మే17 : చీరాల సమీపంలోని పేరా లలో బ్లాక్‌ ఫంగస్‌ మరణం చోటుచేసుకుంది. ప్రజలతోపాటు అధికారగణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా సెకండ్‌ వేవ్‌తో అవస్థలు పడు తున్న అధికారులకు, ప్రజలకు బ్లాక్‌ ఫంగస్‌తో ఆందోళన మరింత పెంచింది. వివరాలలోకి వెళితే..

 పేరాలలోని గోలివారివీధికి చెందిన శిద్దా సురేష్‌(39), లక్ష్మీ దంపతులు. వీరికి 6, 8 సంవత్సరాల వయస్సుగల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్‌ చీరాల పరిధిలోని ఓ ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల క్రితం కరోనా బారినపడగా, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా అనిపించడంతో మిత్రుల సలహాతో పది రోజుల క్రితం గుంటూరులోని ఓ ప్రయివేట్‌ వైద్యశాలలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో ఇటీవల నిర్వహించిన పరీక్షలలో బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయింది. అక్కడి వైద్యుల సలహా మేరకు మిత్రులు, బంధువులు హైదరాబాద్‌లోని సన్‌షైన్‌ హాస్పటల్‌కు శుక్రవారం తరలించారు. ఈలోగా సురేష్‌కు కుడి కన్ను,  కుడి ముక్కు ఉబ్బిపోయాయి. దీంతో అక్కడ వైద్యులు శనివారం దవడను తొలగిం చారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు.

బంధువులు, మిత్రులు కన్నీటి పర్యంతం..

సురేష్‌ను మెరుగైన వైద్యంకోసం గుంటూరు తరలించిన నాటి నుండి అతని మిత్రులు సురేష్‌ కుటుంబ పరిస్థితి గ్రహించి  రూ.5లక్షల వరకు సాయం అందించారు. అవసర మైతే ఇంకా ఏదోలా సాయం చేయాలనుకున్నా వారి ఆశ నిరాశగా మిగిలింది. మృతునికి మరో ముగ్గురు సోదరీలు ఉండగా, వారికి వివాహాలయ్యాయి. పేరాలలోని ఇంటిలో మృతుని తల్లి విజయ లక్ష్మి(70) తనకిక దిక్కెవరంటూ బోరున విలపిస్తున్న సంఘటన స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. 


Updated Date - 2021-05-18T05:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising