ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు ‘బహుజన బడిబాట’

ABN, First Publish Date - 2021-10-22T05:22:48+05:30

బడి ఈడు పి ల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు బహజన టీ చర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బహుజనబడి బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ప్రధానకా ర్యదర్శి పర్రె వెంకట్రావు తెలిపారు.

మాట్లాడుతున్న వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీటీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకట్రావు 


ఒంగోలువిద్య, అక్టోబరు 21 : బడి ఈడు పి ల్లలను స్కూళ్లలో చేర్పించేందుకు బహజన టీ చర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బహుజనబడి బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ప్రధానకా ర్యదర్శి పర్రె వెంకట్రావు తెలిపారు. గురువారం ఒంగోలులోని అంబేడ్కర్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో బహుజన బడిబాట కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సం దర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఇటీవలకా లంలో కరోనా ప్రభావంతో పిల్లలకు ఎక్కువ రో జులు సెలవులు రావడం, పాఠశాలలకు గైర్హాజ రవుతున్నట్లు చెప్పారు. కొంతమంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారని, వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీకాలనీల్లోని పిల్లలు ఉన్నట్లు గుర్తించా మని తెలిపారు. వీరందరిని మళ్లీ బడికి పంపిం చాలనే సదుద్ధేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతి మండలంలోని బీటీఏ కార్యక ర్తలు గ్రామాలను సందర్శించి బడిబయట పిల్లల ను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠ శాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు,  సంఘ సేవ చే స్తున్న సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్ళాల ని  కోరారు. కార్యక్రమంలో చినవెంగయ్య, ఎల్‌. అంటోనీ, సరత్‌చంద్రబాబు, పి.సువర్ణబాబు, ఎ. శ్రీనివాసులు, పి.రాచయ్య, మనోహరరావు, రాజే ంద్రప్రసాద్‌, రామయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising