ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయం చేయమంటే మాయం చేశాడు

ABN, First Publish Date - 2021-04-17T05:18:00+05:30

ఏటీఎంలో నగదు డ్రా చేసి ఇవ్వాలని సాయమడిగితే ఏకంగా కార్డు మార్చి ఇచ్చి ఆ తర్వాత దర్జాగా నగదు డ్రా చేసుకున్నాడు ఓ మోసగాడు.

బాధితుడు నర్సింహులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శిలో ఏటీఎం కార్డు మార్చి ఇచ్చి మోసం చేసిన ఘనుడు

ఆ తర్వాత పలుమార్లు డబ్బులు డ్రా

లబోదిబోమంటున్న బాధితుడు


దర్శి, ఏప్రిల్‌ 16 : ఏటీఎంలో నగదు డ్రా చేసి ఇవ్వాలని సాయమడిగితే ఏకంగా కార్డు మార్చి ఇచ్చి ఆ తర్వాత దర్జాగా నగదు డ్రా చేసుకున్నాడు ఓ మోసగాడు. పది రోజుల తర్వాత విష యం తెలియడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకెళ్తే... దర్శికి చెందిన నర్సింహులు 10 రోజుల క్రితం స్థానిక స్టేట్‌బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లాడు. ఆయన కు కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసే విధానం తెలియదు. అక్కడ కొందరు యువకులు అప్పటికే డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. అందులో ఒక యువకుడ్ని తనకు రూ.16వేలు తీసి ఇవ్వాలని నర్సింహులు అడిగి ఏటీఎం కార్డు ఇచ్చాడు. అడిగినట్టే డబ్బులు డ్రా చేసి ఇచ్చాక ఆ యువకుడు మరో ఏటీఎం కా ర్డును నరసింహులకు ఇచ్చాడు. ఏటీఎం కార్డు మార్చి ఇచ్చిన విషయాన్ని బాధితుడు గుర్తించలేదు. మళ్లీ డబ్బులు అవసరం రావడంతో శుక్రవారం ఏటీఎం వద్దకు వెళ్లాడు. తెలిసిన వారి ద్వారా ఏటీఎం కార్డు పెట్టి చూడగా పనిచేయలేదు. అనుమానం వచ్చిన నరసింహులు బ్యాంకులో విచారించాడు. అతని ఖాతా నుంచి పలు ధఫాలుగా రూ.80వేలు నగదు డ్రా చేసినట్లు  రికార్డుల్లో ఉంది. 10 రోజుల క్రితం డబ్బులు తీసి ఇచ్చిన యువకుడే ఏటీఎం కార్డు మార్చి మోసం చేశాడని లబోదిబోమని విలపించాడు. బ్యాంకు అధికారులు సీసీ కెమెరాల ద్వారా మోసగాడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2021-04-17T05:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising