ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతిగా ఎరువులు, పురుగు మందులు వాడొద్దు

ABN, First Publish Date - 2021-10-28T04:00:47+05:30

ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడితే ఆ భూ ములు నిస్సారం అవుతాయని ఏడీఏ సుదర్శనరాజు అన్నారు.

శిక్షణలో మాట్లాడుతున్న ఏడీఏ సుదర్శనరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఏడీఏ సుదర్శనరాజు

ఎర్రగొండపాలెం, అక్టోబరు 27 : ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడితే ఆ భూ ములు నిస్సారం అవుతాయని ఏడీఏ సుదర్శనరాజు అన్నారు.  ఎర్రగొండపాలెం సబ్‌డివిజన్‌ కేంద్రంలో వ్యవసాయ, ఉద్యానసహాయలకు బుధవారం భూమి పోషణ అభియా న్‌ పథకం కింద అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు, ఉద్యాన శాఖ సహాయకులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. రైతులు పంట సాగుకు ముందు కచ్చితంగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవా లన్నారు.  రిపోర్టు వచ్చిన త ర్వాత అందుకు తగ్గట్టుగా రైతులు సాగు చేపట్టాలన్నారు. పైర్ల సాగులో రసాయనిక ఎ రువులు, పురుగు మందులు వాడుకోవాలన్నారు. గ్రామాల్లో  రైతులను చైతన్యం చేయాలని గ్రామవ్యవసాయ, ఉద్యానవన సహాయకులను కోరారు. శిక్షణలో ఒంగోలు డాట్‌ సెంటరు శాస్త్రవేత్త వరప్రసాద్‌, హెచ్‌ ఓ షేక్‌ నబీరసూల్‌,  వ్యవసాయాధికారి పి వెంకటేశ్వర్లు, పు ల్లలచెరువు, దోర్నాల, త్రిపురాంతకం  వ్యవసాయాధికారు లు, వీఏఏలు, హెచ్‌ ఏఏలు పాల్గొన్నారు.

వరి పంట పరిశీలన

త్రిపురాంతకం : మండలంలోని మేడపి, ఎండూరివారిపాలెం గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటను డాట్‌ శాస్త్రవేత్త వరప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. అనం తరం రైతులకు పంటలో తీసుకోవాల్సిన మెళకువలను వివరించారు. వరిలో జింక్‌ నివారణలోపం ఉందని, దీనికోసం జింక్‌ సల్ఫేట్‌ మం దును రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలన్నారు. ప్రస్తుతం చలి వాతావరణం పెరుగుతున్నందున అగ్గి తెగ్గులు వస్తుందని, దీని నివారణకు ట్రైసైక్లోసోల్‌ మందును 120 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలన్నారు. సుడిదోమ ఆశిస్తే ఎతిప్రోల్‌ మందును 0.25 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవ సాయాధికారి కె.నీరజ, వీఏఏ, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T04:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising