శిద్దాను కలిసిన ఆర్యవైశ్య నాయకులు
ABN, First Publish Date - 2021-10-30T05:27:02+05:30
ఇటీవల జరిగిన ఒంగోలు మండల ఆ ర్యవైశ్య సంఘ ఎన్నికలలో గెలుపొందిన నాయకులు శుక్రవారం మాజీ మంత్రి శిద్దా రాఘవరావును స్థానిక ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శాలువా కప్పి, బొకే ఇచ్చి సత్కరించారు.
ఒంగోలు(కల్చరల్), అక్టోబరు 29: ఇటీవల జరిగిన ఒంగోలు మండల ఆ ర్యవైశ్య సంఘ ఎన్నికలలో గెలుపొందిన నాయకులు శుక్రవారం మాజీ మంత్రి శిద్దా రాఘవరావును స్థానిక ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శాలువా కప్పి, బొకే ఇచ్చి సత్కరించారు. నవంబరు 7వ తేదీన జరగనున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల ఆర్యవై శ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పబ్బిశెట్టి భాస్కర్, వలివేటి పవన్‌కుమార్, ట్రెజరర్ వేముల తిరుమలరావు, జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కనమ ర్లపూడి హరిప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వర్లు, మిరియాల కృష్ణ, కొల్లిపర సురేష్, పేర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T05:27:02+05:30 IST