ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లీకుల కట్టడి

ABN, First Publish Date - 2021-07-29T06:32:32+05:30

వెలిగొండ ప్రాజెక్ట్‌లోని లీకులపై అధికారులు స్పందించారు. ప్రధానమైన హెడ్‌ రెగ్యులేటర్‌ లీకేజీలకు ప్రాజెక్టు అధికారులు మరమ్మతులు చేపట్టారు.

లీకైన నీటిని తొలగించిన మొదటి టన్నెల్‌ ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెలిగొండ సొరంగంలోకి ఆగిన వరద నీరు

20 మోటార్లతో తోడి తీగలేరుకు మళ్లింపు

రెండో సొరంగం పనులకు చర్యలు

పెద్ద దోర్నాల, జూలై 28 : వెలిగొండ ప్రాజెక్ట్‌లోని లీకులపై అధికారులు స్పందించారు. ప్రధానమైన హెడ్‌ రెగ్యులేటర్‌ లీకేజీలకు ప్రాజెక్టు అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో సొరంగంలోకి వరద నీటి ప్రవాహం మంగళవారం సాయంత్రానికి ఆగిపోయింది. సొరంగం ఆరంభంలో  నిల్వ ఉన్న నీటిని యుద్ధప్రాతిపదికన 20 మోటార్లతో బయటకు తోడి పోశారు. ఆ నీటిని తీగలేరు వాగుకు మళ్లించారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించి శ్రీశైలం డ్యామ్‌కు చేరింది. కాగా ఆ నీటి ఆధారంగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులోని కీలకమైన మొదటి సొరంగంలోకి హెడ్‌ రెగ్యులేటర్‌ లీకుల ద్వారా ప్రవహించడంతో సంబంధిత అధికారులు, కార్మికులు భయాందోళన చెందారు. గంటగంటకూ పెరుగుతున్న కృష్ణమ్మ ప్రవాహంతో డ్యామ్‌లోకి పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో అందరిలోనూ పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా హెడ్‌ రెగ్యులేటర్‌ లీకులకు మరమ్మతులు నిర్వహించ లేకపోయినా, లాకులు మరింత తెరుచుకున్నా తర్వాత జరిగే ఉపద్రవానికి పంట భూములు, ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళన నెలకొంది. అయితే ప్రాజెక్టు అధికారులు విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణులను పిలిపించారు. హెడ్‌ రెగ్యులేటర్‌కు ఏర్పడిన లీకులకు మరమ్మతులు చేపట్టారు. దీంతో వరద నీరు నిలిచిపోయింది. సొరంగం మొదటి వైపు ఉన్న నీటిని, బురదను బుధవారం తొలగించారు. తిరిగి పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలను వేగవంతం చేశారు. పీఢర్‌ కెనాల్‌కు సొరంగాన్ని కలుపుతూ అప్రోచ్‌ కాలువ పనులు చేపట్టారు. రెండో సొరంగం తవ్వకం పనులు కూడా రెండు మూడు రోజుల్లో పునఃప్రారంభించనున్నట్లు ప్రాజెక్టు ఈఈ అబూతాలిమ్‌ తెలిపారు.


Updated Date - 2021-07-29T06:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising