ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఏపీ ఏదీ?

ABN, First Publish Date - 2021-10-18T05:42:35+05:30

‘రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఎరువుల కొరత లేకుండా చూస్తాం. భరోసా కేంద్రాల్లోనే వాటిని అందుబాటులో ఉంచుతాం’ అని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. జిల్లాలో ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ముఖ్యంగా డీఏపీకి కటకట ఏర్పడింది. ఆర్‌బీకేలతోపాటు, ప్రైవేటు దుకాణాల్లో కూడా అవసరమైన మేర అందుబాటులో లేదు. ఇదే అవకాశంగా వ్యాపారులు ధర పెంచి దోచుకుంటున్నారు. జిల్లాలో ఈఏడాది ఇప్పటి వరకూ 8లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు.

లారీ నుంచి దించుతున్న ఎరువు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో తీవ్ర కొరత

అదునులో అందక రైతుల అవస్థ

అలంకారప్రాయంగా ఆర్బీకేలు

చీరాల, అక్టోబరు 17 : ‘రైతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఎరువుల కొరత లేకుండా చూస్తాం. భరోసా కేంద్రాల్లోనే వాటిని అందుబాటులో ఉంచుతాం’ అని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. జిల్లాలో ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ముఖ్యంగా డీఏపీకి కటకట ఏర్పడింది. ఆర్‌బీకేలతోపాటు, ప్రైవేటు దుకాణాల్లో కూడా అవసరమైన మేర అందుబాటులో లేదు. ఇదే అవకాశంగా వ్యాపారులు ధర పెంచి దోచుకుంటున్నారు. జిల్లాలో ఈఏడాది ఇప్పటి వరకూ 8లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు రబీ సాగుకు ఉపక్రమించారు. పలు ప్రాంతాల్లో ఖరీఫ్‌లో సాగుచేసిన మిర్చికి ఇప్పుడు డీఏపీ అవసరం ఉంది. దాన్ని దుక్కుల్లో వెదబెట్టకపోతే పంటలో ఎదుగుదల లోపించే అవకాశం ఉంది. అలాగే రబీలో రైతులు శనగ విస్తారంగా సాగు చేస్తారు. ఈసారి 85,000 హెక్టార్లలో పంట సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శనగ విత్తనం వేసే ముందు  దుక్కిలో డీఏపీ వాడతారు. దీంతో రైతులు అరువుపై ఎరువులు ఇచ్చే దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ డీఏపీ లేదని వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు. అప్పోసొప్పో చేసి ఆర్‌బీకేలు, పీఏసీఎఎస్‌లలో కొనుగోలు చేద్దామన్నా అక్కడా డీఏపీ అందుబాటులో లేదు. ఇదేఅదనుగా అక్కడక్కడా కొందరు వ్యాపారులు అదనపు దోపిడీకి పాల్పడుతున్నారు. తమ వద్ద ఉన్న ఎరువులను నిల్వ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. డీఏపీ పాత స్టాకు బస్తా ఎమ్మార్పీ ప్రకారం రూ. 1200 నుంచి రూ.1250 ఉండగా విక్రయించాల్సి ఉండగా రూ.1500 నుంచి రూ.1700 వరకూ వసూలు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-18T05:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising