ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతి లేనిదే విత్తనాలు విక్రయించరాదు

ABN, First Publish Date - 2021-07-25T06:05:43+05:30

కంపెనీల అనుమతి లేనిదే రైతులకు విత్తనాలు విక్ర యించరాదని ఎర్రగొండపాలెం ఏడీఏ సుదర్శన రాజు తెలిపారు.

రికార్డులు తనిఖీ చేస్తున్న ఏడీఏ సుదర్శన్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడీఏ సుదర్శనరాజు

పలు దుకాణాల్లో తనిఖీలు

మార్కాపురం, జూలై 24 : కంపెనీల అనుమతి లేనిదే రైతులకు విత్తనాలు విక్ర యించరాదని ఎర్రగొండపాలెం ఏడీఏ సుదర్శన రాజు  తెలిపారు. మార్కాపురం పట్టణం, మం డలంలోని కోమిటికుంట, చింతగుంట్లలో విత్తన విక్రయ దుకాణాలను శనివారం ఆయన ఆక స్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని శ్రీ భాగ్యలక్ష్మీ ట్రేడర్స్‌, ఓం సాయి ట్రేడర్స్‌, శ్రీ గా యత్రీ ట్రేడర్స్‌, శ్రీ వెంకటేశ్వర సీడ్స్‌, శ్రీహరి ట్రేడర్స్‌, కోమటికుంటలోని జైకిసాన్‌ ఆగ్రో ఏజె న్సీస్‌, చింతకుంటలోని అనిల్‌ ఫెర్టిలైజర్స్‌లను తనిఖీ చేశారు. గత మూడు నెలలుగా అమ్మిన పత్తి, మిరప విత్తనాల వివరాలను, స్టాక్‌ రిజి స్టర్‌, ఇన్వాయిస్‌, కంపెనీల అనుమతి పత్రా లను పరిశీలించారు. కంపెనీ అనుమతి పత్రా లు చూపించని 150 కేజీల మిర్చి విత్తనాల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్‌, హోల్‌సేల్‌ వ్యాపారులు, కంపెనీల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాల న్నారు. అనుమతులు లేనివారిపై  విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏడీఏ హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన వి త్తనాలకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాన్నారు. మిర్చి విత్తనాల డిమాండ్‌ను ఆసరాగా తీసు కొని రైతులకు గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదన్నారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం  ఉద్యాన శాఖ అధికారి రసూల్‌,  టీఏవో తిరుమలరావు, ఏవో లక్ష్మీనా రాయణ పాల్గొన్నారు. 

వై.పాలెంలో..

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో విత్తన దుకాణాలపై అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఏడీఏ డి.బాలాజీనాయక్‌, ఉద్యాన అధికారి సురేష్‌  శివపార్వతి విత్తన దుకాణంలో తనిఖీలు చేశారు. రూ.3,44,900 లక్షల, రూ.44వేల 900 విలువైన  విత్తనాలకు అనుమతి లేనట్లు గు ర్తించారు. వాటి అమ్మకాలపై నిషేధం వి ధిం చారు. దుకాణ డీలర్‌కు నోటీసు ఇచ్చి సం జా యిషీ కోరినట్లు అధికారులు తెలిపారు. వారి తోపాటు ఏవో వెంకటేశ్వర్లు ఉన్నారు. 


Updated Date - 2021-07-25T06:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising