ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చ గడ్డి కోస్తే భగ్గుమన్న కక్షలు

ABN, First Publish Date - 2021-02-16T04:47:34+05:30

పొలం గట్టుపై పచ్చి గడ్డి కోశారని ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కడపరాజుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది.

దాడిలో గాయపడిన మహాలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలువురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

పరస్పరం కేసుల నమోదు

పెద్ద దోర్నాల, ఫిబ్రవరి 15 : పొలం గట్టుపై పచ్చి గడ్డి కోశారని ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కడపరాజుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిబాబు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోనుగుంట్ల పోలయ్య, చిన్నపోలయ్యలకు చెందిన పొలం గట్టుపై ఉన్న పచ్చి గడ్డిని పొరుగునే ఉన్న గోనుగుంట్ల నాగేశ్వరరావు పొలంలో మిరపకాయల కోతకు వచ్చిన కూలీలు కోశారు. దీంతో చిన్నపోలయ్య, పెద్ద పోలయ్య భార్యలు రమణమ్మ, రాజేశ్వరి రోజూ చెప్తున్నా గడ్డి కోసుకుపోతున్నారని దూషణకు దిగా రు. పక్క పొలంలో ఉన్న నాగేశ్వరరావు భార్య పద్మ, మరదలు రాజేశ్వరి కల్పించుకుని వాదనకు దిగారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఇంటికొచ్చాక వారి వారి భర్తలకు జరిగిన విషయం చెప్పడంతో మరోసారి ఇరు కుటుంబాల మ ధ్య వాగ్వివాదం జరిగింది. ఒకరిపై  మరొక రు దాడులు చేసుకున్నా రు. ఈ దాడుల్లో పోల య్య, బక్కయ్య, మహాలక్ష్మి, ఆదినారాయణ, వెంకటయ్యకు, మరో వర్గానికి చెందిన నాగేశ్వరరావు, రాజయ్యకు గా యాలయ్యాయి. వీరిలో నాగేశ్వరరావు తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మహాలక్ష్మి పరిస్థితి విషమించడంతో ఒంగోలు తరలించారు. కేసులు నమోదు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.





Updated Date - 2021-02-16T04:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising