ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రకేసరి యూనివర్సిటీ బిల్లు ఆమోదం

ABN, First Publish Date - 2021-11-26T05:29:04+05:30

జిల్లాలో ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు కావాలన్న జిల్లావాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టం 1991కు సవరణ చేస్తూ 2021 సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే శాసనసభ ఆమోదించగా గురువారం మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

యూనివర్సిటీ ప్రతిపాదిత ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెరవేరిన జిల్లావాసుల చిరకాల కోరిక

మండలిలో ప్రవేశపెట్టిన మంత్రి సురేష్‌ 

ఒంగోలు విద్య, నవంబరు 25: జిల్లాలో ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు కావాలన్న జిల్లావాసుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టం 1991కు  సవరణ చేస్తూ 2021 సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే శాసనసభ ఆమోదించగా గురువారం మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేవలం జీవో ఇచ్చిందన్నారు. కనీసం వీసీ పోస్టు కూడా మంజూరు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం యూనివర్సిటీ ప్రాధాన్యతను గుర్తెరిగి ఎస్‌ఎన్‌పాడు మండలం పేర్నమిట్టలో ఏర్పాటుకు ప్రతిపాదించిందని తెలిపారు. ఇప్పటికే స్థల సేకరణ చేశామని, అవసరమైన పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని వర్సిటీలకు భిన్నంగా ఇక్కడ ఉపాధ్యాయ విద్య ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న ఉపాధ్యాయ విద్యను ఉన్నత విద్యలోకి చేర్చే అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా ఒక శిక్షణ కేంద్రాన్ని స్థాపించి, అధ్యాపక విద్య నాణ్యతను పెంచడం ద్వారా నాణ్యమైన అధ్యాపకులను తయారు చేయాలని అనేది లక్ష్యమని మంత్రి చెప్పారు. బిల్లు ఆమోదం ద్వారా యూనివర్సిటీ ఏర్పాటులో తదుపరి చర్యలు వేగవంతం జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. 


Updated Date - 2021-11-26T05:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising