ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 కోర్సులతో ఏకేయూ

ABN, First Publish Date - 2021-11-28T06:31:59+05:30

ప్రభుత్వ ఆమోదం పొంది ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ)లో 26 కోర్సులు అందుబాటులోకి రానున్నాయని వర్సిటీ ఓఎస్‌డీ డాక్టర్‌ కె.వి.ఎన్‌.రాజు తెలిపారు.

కె.వి.ఎన్‌.రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓఎస్‌డీ డాక్టర్‌ కె.వి.ఎన్‌.రాజు వెల్లడి 

ఒంగోలు విద్య, నవంబరు 27 : ప్రభుత్వ ఆమోదం  పొంది ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఆంధ్రకేసరి యూనివర్సిటీ (ఏకేయూ)లో 26 కోర్సులు అందుబాటులోకి రానున్నాయని వర్సిటీ ఓఎస్‌డీ డాక్టర్‌ కె.వి.ఎన్‌.రాజు తెలిపారు. శనివారం స్థానిక యూనివర్సిటీ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒంగోలులో ఏర్పాటు చేయనున్న వర్సిటీ టీచింగ్‌ యూనివర్సిటీగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ తరహాలో ఇప్పటికే ఢిల్లీలో ఒక యూనివర్సిటీ ఉండగా,  ప్రస్తుతం ఒంగోలులో రెండవది ఏర్పాటు కానుందన్నారు. ఏకేయూలో 10 పాత కోర్సులతోపాటు 16 కొత్త కోర్సులు వస్తాయని వెల్లడించారు. వీటిలో సంప్రదాయ కోర్సులతోపాటు ప్రత్యేక కోర్సులు కూడా ఉంటాయన్నారు. 78 టీచింగ్‌, 38 నాన్‌ టీచింగ్‌ కలిపి మొత్తం 116 పోస్టులు మంజూరు అవుతాయన్నారు. పేర్నమిట్ట వద్ద ఉన్న 109 ఎకరాలను అభివృద్ధి చేసి అక్కడ అకడమిక్‌ కోర్సులు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలను అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌గా ఉపయోగిస్తామన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో పీజీ అడ్మిషన్లు జరిగే అవకాశం ఉందని డాక్టర్‌ రాజు చెప్పారు. 





Updated Date - 2021-11-28T06:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising