ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి గుడ్‌బై.. టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2021-09-17T05:29:29+05:30

వైసీపీకి గుడ్‌బై..

పామూరులో ఉగ్రతో సమావేశమైన బీఎంసీ, ఆయన అనుచరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, ఒంగోలులో టీడీపీలో చేరికలు 

గతంలో వైసీపీలో చేరి తప్పుచేశామంటూ ప్రకటన 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): గిద్దలూరు నియోజకవర్గంలో ప్రారంభమైన అధికార వైసీపీకి గుడ్‌బై చెప్పే కార్యక్రమం గురువారానికి కనిగిరి, ఒంగోలు నియోజకవర్గాలకు కూడా చేరింది. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమక్షంలో పలువురు టీడీపీలో చేరగా కొందరు ప్రముఖులు మద్దతు తెలిపి అనుచరులతో అధికారికంగా పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలోని రెడ్డిపాలెంలో ఒక వర్గానికి చెందిన పది కుటుంబాల వారు దామచర్ల జనార్దన్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరంతా గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు.


అలాగే పామూరు మండలంలో బలమైన ప్రజాసంబంధాలు ఉన్న బి.మాల్యాద్రి చౌదరి(బీఎంసీ) తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన నివాస ప్రాంతానికి ఉగ్రనరసింహారెడ్డి వెళ్లి ఆయన్ను కలిశారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వెంటనే ఆయన వైసీపీ పాలన తీరు, స్థానిక నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీలో చేరి ఉగ్ర సారథ్యంలో పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన వద్దకు ఉగ్ర వచ్చారని తెలియగానే పలువురు బీఏంసీ అనుచరులు అక్కడకు చేరి ఆయన నిర్ణయాన్ని బలపరిచారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరాలని ఉగ్ర కోరటంతో అందుకు బీఏంసీ అంగీకరించి పెద్దసంఖ్యలో అనుచరులతో చేరతానని ప్రకటించారు. 


Updated Date - 2021-09-17T05:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising