ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్తు ఓవర్‌లోడ్‌ కాకుండా చర్యలు

ABN, First Publish Date - 2021-05-19T07:46:06+05:30

వేసవి కాలంలో అధికలోడ్‌తో విద్యుత్‌కు అంతరాయం జరుగకుండా చూడాలని ఏడీఈ హరిప్రసాద్‌రావు అన్నారు.

మాట్లాడుతున్న హరిప్రసాద్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిబ్బందితో ఏడీఈ హరిప్రసాద్‌రావు

తాళ్లూరు, మే 18: వేసవి కాలంలో అధికలోడ్‌తో విద్యుత్‌కు అంతరాయం జరుగకుండా చూడాలని ఏడీఈ హరిప్రసాద్‌రావు అన్నారు. స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఏఈ వీరబ్రహ్మం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవికాలంలో విద్యుత్‌ వాడకం అధికంగా ఉంటుందన్నారు. దీంతో ఓవర్‌లోడ్‌ వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతూ విద్యుత్‌ అంతరాయం కలుగుతుందన్నారు. ముందస్తుగా కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. తూర్పుగంగవరం సబ్‌స్టేషను పరిధిలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను కావాలని వినియోగదారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. సమావేశంలో సబ్‌ఇంజనీర్‌ అంకబాబు, ఎల్‌ఐ శ్రీనివాసరావు, కాంతారావు, ఎల్‌ఎంలు రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య, కోటేశ్వరరావు, బాబూరావు, బాషా, కోటిరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T07:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising