ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాలకొండలో తలనీలాలు, కొబ్బరి చిప్పల వేలం పూర్తి

ABN, First Publish Date - 2021-06-16T07:14:02+05:30

మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామికి తలనీలాలతో పాటు మరో 5 వేలం పాటలు ద్వారా రూ.1,48,09000 ఆదాయం లభించినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ కేబీ శ్రీనివాసరావు తెలిపారు.

వేలం నిర్వహిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాలకొండ, (వలేటివారిపాలెం) జూన్‌ 15 : మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామికి తలనీలాలతో పాటు మరో 5 వేలం పాటలు ద్వారా రూ.1,48,09000 ఆదాయం లభించినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ కేబీ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని మాలకొండ దేవాలయంపైన కల్యాణ మండపంలో ఒంగోలు దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ జి.మాధవి పర్యవేక్షణలో మంగళవారం రెండోసారి బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటలు 5-7-2021 నుంచి 31-3-2022 వరకూ కాలపరిమితి (9 నెలలు) మాత్రమే నిర్వహించారు. తలనీలాలు పోగుచేసుకునే హక్కు పాటను తిరుపతికి చెందిన గరుడ ఎంటర్‌ప్రైజస్‌ సంస్థ రూ. 1,17,09000లకు పాటను దక్కించుకుంది. కొబ్బరిచిప్పలు పోగుచేసుకునే హక్కు పాటను వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలేనికి చెందిన జాలారి ప్రసాద్‌ రూ.7,60,000కు పాడుకున్నారు. నెయ్యి, పాలు వసూళ్లు చేసుకునే హక్కు పాటను అయ్యవారిపల్లెకు చెందిన ముచ్చు గిరిప్రసాద్‌ రూ.44 వేలకు పాడుకున్నారు. చీరలు, జాకెట్లు పాటను అయ్యవారిపల్లెకు చెందిన బచ్చు రోశయ్య రూ.8,10,000కు పాటను దక్కించుకున్నాడు. కొబ్బరికాయలు అమ్ముకునే పాటను పోలినేనిపాలేనికి చెందిన జాలారి ప్రసాద్‌ రూ.13,25,000కు పాడుకున్నారు. మిగిలిన 6 పాటలైన అద్దాలు, ఫొటోలు అంగడి, ఫ్యాన్సీ అంగళ్లు రెండు, కూల్‌డ్రింక్స్‌ అంగళ్లు రెండు, ఫలహారశాల అంగళ్లు రెండు, పాదరక్షలు భద్రపరిచే పాటలకు సరైన పాటలు రానందున వాయిదా వేనట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - 2021-06-16T07:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising