ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు చూపించి వేయలేదని కక్ష సాధింపు

ABN, First Publish Date - 2021-03-21T06:43:17+05:30

గత నెలలో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీపార్టీకి మద్దతుగా చూ పించి ఓటు వేయలేదన్న కారణంతో కొర్రపాటివారిపాలెం గ్రామంలో నిత్యం ప్రజలకుసేవలు చేస్తున్న ఆశాకార్యకర్త వెల్లంపల్లి పల్లవిని తొలగించాలని కొందరు ఆ గ్రామ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవడంపై నిరసన తెలుపుతూ శనివారం స్థానిక తాళ్లూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశాకార్యకర్తలు నిరసన తెలిపారు.

నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లూరు, మార్చి 20 : గత నెలలో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీపార్టీకి మద్దతుగా చూ పించి ఓటు వేయలేదన్న కారణంతో కొర్రపాటివారిపాలెం గ్రామంలో  నిత్యం ప్రజలకుసేవలు చేస్తున్న ఆశాకార్యకర్త వెల్లంపల్లి పల్లవిని తొలగించాలని కొందరు ఆ గ్రామ అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవడంపై నిరసన తెలుపుతూ శనివారం స్థానిక తాళ్లూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశాకార్యకర్తలు నిరసన తెలిపారు. వీరికి సీపీఎం  కార్యదర్శి బొడపాటి హనుమంతరావు మద్దతు తెలిపారు. ప్రజలకు మంచి సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుండగా రాజకీయ కక్షతో గర్బవతిగా వున్న ఆశా కార్యకర్తను తొలగించాలని ఒత్తిడి తేవడం తీరని అన్యాయమన్నారు. ఆమెకు తగు న్యాయం చేయాలని స్థానిక వైద్యాధికారి షేక్‌ ఖాదర్‌ మస్తాన్‌బీకి ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. ఓటుచూపించి వేయలేదన్న అక్కసుతో ఉద్యోగం నుండి తీసి వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆశా కార్యకర్త వై.పల్లవి మాట్లాడుతూ తనను కొంత మంది ఓటు చూపించి వేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారన్నారు. తాను నిరాకరించడంతో   తనను వేధిస్తున్నారన్నారు.  గ్రామానికి చెందిన కె.విష్ణు, ధర్మేంద్ర, నాగార్జున అనే వారు తనపై లేనిపోని ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారన్నారు.  ఈ విషయమై స్థానిక వైద్యాధికారి షేక్‌ ఖాధర్‌ మస్తాన్‌బీ మాట్లాడుతూ ఆశాకార్యకర్త పల్లవిపని తీరు సంతృప్తికరంగా ఉందని, గ్రామంలో కొందరు ఆ కార్యకర్తను తొలగించాలని వత్తిడి తేవటం వాస్తవమే నన్నారు. తొలగించే పరిధి తమ చేతిలో లేదన్నారు.

Updated Date - 2021-03-21T06:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising