ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో 2 గంటలకు 50 శాతం పోలింగ్‌ నమోదు

ABN, First Publish Date - 2021-03-10T21:14:51+05:30

విజయవాడలో 2 గంటలకు 50 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. చివరి 2 గంటల్లో తమకు అనుకూలమైన డివిజన్లలో రిగ్గింగ్‌ చేసేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడలో 2 గంటలకు 50 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. చివరి 2 గంటల్లో తమకు అనుకూలమైన డివిజన్లలో రిగ్గింగ్‌ చేసేందుకు వైసీపీ యత్నాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓట్లు వేసిన వారే మళ్లీమళ్లీ వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ ఏజెంట్లను సైతం బెదిరించి దొంగ ఓట్లకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు. హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ బూత్‌‌ల వద్దకు పోలీసులు అదనపు బలగాలను పంపుతున్నారు. 


అంతకుముందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ వద్ద వైసీపీ నేతలు దాదాగిరికి దిగారు. ఫ్యాన్‌కు ఓటు వేయాలి అంటూ ఓటు హక్కును వినియోగించుకోడానికి వచ్చినవారిని వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల కనుసంధనలో జరుగుతున్నా పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతల దాదాగిరిపై స్వర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


పురపాలక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ కొనసాగుతోంది. ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,214 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 38,25,129 మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952. ట్రాన్స్‌జెండర్లు 1150 మంది ఉన్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Updated Date - 2021-03-10T21:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising