వి కోటలో టీడీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2021-10-29T17:30:31+05:30
వి.కోటలో టీడీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై బైటాయించారు.
చిత్తూరు : వి.కోటలో టీడీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై బైటాయించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు ర్యాలీగా వెళుతున్న ఆ పార్టీ నేతలను వి.కోట పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అడ్డగించారు. తమ పార్టీ అధినేతపై అభిమానంతో కార్యకర్తలు స్వచ్ఛందంగా ర్యాలీకి బయలుదేరితే వాటిని పోలీసులను అడ్డుపెట్టుకుని అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
Updated Date - 2021-10-29T17:30:31+05:30 IST