ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాభి ఇంటి దగ్గరకు భారీగా చేరుకుంటున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-10-20T22:28:17+05:30

టీడీపీ నేత పట్టాభి ఇంటి దగ్గరకు భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. కాసేపట్లో పట్టాభిని అరెస్ట్‌ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ నేత పట్టాభి ఇంటి దగ్గరకు భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. కాసేపట్లో పట్టాభిని అరెస్ట్‌ చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. సీఎం జగన్‌ను పట్టాభి దూషించారంటూ కేసులు నమోదు చేసి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. పట్టాభిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఆ సమయంలో పట్టాభి, ఆయన భార్య చందన ఇంట్లో లేరు. ఇంట్లో పట్టాభి కుమార్తె అన్నపూర్ణ, పనిమనిషి గోవిందమ్మ ఉన్నారు. డ్రైవర్‌ శివారెడ్డి బయట కూర్చుని ఉన్నాడు. మొదట ముగ్గురు, నలుగురు యువకులు వెళ్లి పట్టాభి ఉన్నాడా అంటూ  డ్రైవర్‌ను అడిగారు. లేరని చెప్పడంతో అంతా దాడికి పాల్పడ్డారు. వందమంది ఒక్కసారిగా లోపలకు రావడంతో పనిమనిషి గోవిందమ్మ భయంతో చిన్నారి అన్నపూర్ణను తీసుకుని బాత్‌రూంలోకి దాక్కుంది. దుండగులు ఇల్లు మొత్తాన్ని చెల్లాచెదురు చేశారు. మహిళలు తొడగొట్టుకుంటూ పట్టాభిపై బూతుపురాణం విప్పారు. 4.10- 4.15 గంటల మధ్య విధ్వంసం జరిగిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కొడవళ్లతో పట్టాభి పీక కోస్తామంటూ మహిళలు నినాదాలు చేశారు. 

Updated Date - 2021-10-20T22:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising