ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు లేఖలకు జవాబు ఇవ్వాలని పీఎంవో సూచన

ABN, First Publish Date - 2021-03-25T02:14:24+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలకు జవాబు ఇవ్వాలని పీఎంవో సూచించింది. విశాఖ ఉక్కుపై ఈ నెల 10, 20 తేదీల్లో లేఖలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలకు జవాబు ఇవ్వాలని పీఎంవో సూచించింది. విశాఖ ఉక్కుపై ఈ నెల 10, 20 తేదీల్లో లేఖలు చంద్రబాబు రాశారు. ప్రధాని మోదీకి బాబు రెండు లేఖలు రాశారు. లేఖలకు గడువులోగా జవాబు పంపాలని అధికారులకు పీఎంవో సూచించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‍మెంట్‌శాఖకు పీఎంవో సూచించింది. చంద్రబాబు లేఖలపై చర్యలు చెప్పాలని ఆర్‍టీఐ ద్వారా రవికుమార్ అనే వ్యక్తి కోరారు. లేఖలు నిర్ధారిస్తూ అధికారులకు చేసిన సూచనలపై పీఎంవో జవాబిచ్చింది.


శాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి అని, తెలుగు ప్రజల ఐక్యతకు చిహ్నమైన స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమను ఆర్థికంగా బలోపేతం చేసి, ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాట్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను ప్రైవేటీకరించాలని భాతర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2021 జనవరి 27న ఆర్‌ఐఎన్‌ఎల్‌ను ప్రైవేటీకరించే ప్రతిపాదనకు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపినట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కార్యదర్శి ప్రకటించారు. 1966 నుంచి తెలుగు ప్రజలు చేసిన మహోద్యమం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చింది.ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమానికి దళిత నేత అమృతరావు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన 12 మంది రక్తంతో స్టీల్‌ప్లాంట్‌ పునాదులు తడపబడ్డాయి. మరో 20 మంది కూడా చనిపోయారు’’ అని చంద్రబాబు లేఖలో గుర్తుచేశారు.



Updated Date - 2021-03-25T02:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising