'కాపునాడు' సంఘం నేత పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూత
ABN, First Publish Date - 2021-05-06T03:59:09+05:30
'కాపునాడు' సంఘం నేత పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూత
అమరావతి: 'కాపునాడు' సంఘం నేత పిళ్లా వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కరోనా సోకి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డారు. వంగవీటి మోహన రంగాకు పిళ్లా అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రాష్టస్థ్రాయిలో కాపు సమస్యల పరిష్కారం కోసం పిళ్లా పని చేశారు.
పిళ్లా వెంకటేశ్వరరావు మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపుల సంక్షేమానికి విశేష కృషి చేసిన పిళ్లా మృతి తీరనిలోటన్నారు. పిళ్లా కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Updated Date - 2021-05-06T03:59:09+05:30 IST