రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్
ABN, First Publish Date - 2021-04-03T23:17:48+05:30
రేణిగుంట విమానాశ్రయానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేరుకున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి తరఫున...
తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేరుకున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం చేయనున్న విషయం తెలిసిందే. ఎమ్మార్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు జరగనున్న పాదయాత్రలో పవన్ పాల్గొంటారు. పవన్‌తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొననున్నారు. పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడనున్నారు.
Updated Date - 2021-04-03T23:17:48+05:30 IST