ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పుపై పాతూరి నాగభూషణం స్పందన

ABN, First Publish Date - 2021-05-21T17:41:58+05:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీనిపై స్పందించిన బీజేపీ నేత, పిటిషనర్ పాతూరి నాగభూషణం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘సత్యమేవ జయతే’ అధర్మమనేది కొన్నిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత ధర్మం వస్తుందన్నారు. అధికారపార్టీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అరాచకం సృష్టించి.. పోలీసులతో కేసులు పెట్టించి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం హైదకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని నాగభూషణం అన్నారు.


ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం వారం వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిందని న్యాయస్థానం పేర్కొంటూ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని.. కౌంటింగ్‌కు అనుమతించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది.

Updated Date - 2021-05-21T17:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising