ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద కుటుంబం.. పెద్ద మనసు!

ABN, First Publish Date - 2021-03-02T09:28:19+05:30

పేద కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. కుటుంబ యజమానికి బ్రెయిన్‌డెడ్‌ అయితే ఆయన అవయవాలు మరొకరికి దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం


పంగులూరు, మార్చి 1: పేద కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. కుటుంబ యజమానికి బ్రెయిన్‌డెడ్‌ అయితే ఆయన అవయవాలు మరొకరికి దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం చందలూరు గ్రామానికి చెందిన నూతలపాటి వెంకటేశ్వర్లు టైర్ల పంక్చర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. గతనెల 15న ఆయన షాపు వద్ద బైక్‌కు పంక్చర్‌ వేసి గాలి కొడుతుండగా అది పేలింది. రిమ్ము ఎగిరిపడి తలకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై వెంకటేశ్వర్లు అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.


13 రోజులపాటు మృత్యువుతో పోరాడిన వెంకటేశ్వర్లుకు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు సోమవారం నిర్ధారించారు. జీవన్‌ధాన్‌ సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానం చేయాలని కోరగా వారు పెద్ద మనసుతో అంగీకరించారు. వెంకటేశ్వర్లు గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని ప్రైవేటు వైద్యశాలకు.. కాలేయం, మూత్రపిండాలను విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-03-02T09:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising