ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుప్తాపై నా అనుచరులు బాధతో దాడి చేసి ఉంటారు: మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2021-12-20T22:59:58+05:30

ఒంగోలులో వైసీపీ నేత గుప్తాపై బాలినేని అనుచరుల దాడి ఘటనపై మంత్రి బాలినేని స్పందించారు. పార్టీలోనే ఉండి విమర్శించడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలులో వైసీపీ నేత గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి బాలినేని స్పందించారు. పార్టీలోనే ఉండి విమర్శించడంతో నా అనుచరులు బాధతో దాడి చేసి ఉంటారని ఆయన చెప్పారు. గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి తమ వాళ్లకు ఆగమని చెప్పానని ఆయన తెలిపారు.


‘‘దాడిని వారించే ప్రయత్నం చేశాను. నా మెంటాల్టీ ఏంటో ఒంగోలు ప్రజలకు తెలుసు. దాడులు చేయడం మా సంస్కృతి కాదు. తన భర్త మతిస్థిమితం లేదని గుప్తా భార్యే చెప్పింది. మతిస్థిమితం లేకే గుప్తా ఆ రోజు సభలో ఆ వ్యాఖ్యలు చేశారు. భార్యే మతిస్థినితం లేదన్న వ్యక్తి కామెంట్లపై నేనేం వ్యాఖ్యలు చేయాలి. కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపాను. ఒంగోల్లో టీడీపీ నేతలను కూడా నేను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. నాది ఆ సంస్కృతి కాదు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముకుంటూ ఉంటారు. అన్ని పార్టీల నేతలతోనూ గుప్తాకు పరిచయం ఉంది.  గుప్తాకు నాతో ఎక్కువగానే పరిచయం ఉన్న మాట వాస్తవమే. గుప్తాతో ఎవరైనా ఈ మాటలు అన్పించారా అనే అనుమానం ఉంది. గుప్తా వ్యాఖ్యల వెనుక టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఉండొచ్చు.  టెండర్ వేశారని సొంత పార్టీ నేతనే కొట్టిన చరిత్ర దామచర్లకు ఉంది. ఆడవారిని విమర్శించడాన్ని ఎవ్వరూ ప్రొత్సహించరు. ఏ పార్టీ వారైనా ఇంట్లో మహిళల గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తప్పే. ఆ రోజు సభలో సీఎం కూడా లేరు. షర్మిల గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినప్పుడు టీడీపీ వాళ్లేమయ్యారు.’’ అని మంత్రి బాలినేని ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-20T22:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising